Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆరునూరైనా పాదయాత్రకే జగన్ మొగ్గు.. అధికార పార్టీకి అస్త్రమేనా?

బుధవారం, 4 అక్టోబరు 2017 (15:12 IST)

Widgets Magazine
ys jagan

రాష్ట్రంలోని ప్రధానప్రతిపక్షమైన వైకాపా, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది. ప్రభుత్వ వైఫల్యాలను తన పాదయాత్ర ద్వారా ఎత్తిచూపాలని భావించిన జగన్‌కు.. కోర్టు కేసులు బ్రేక్‌ వేసేలా కనిపిస్తున్నాయి. పార్టీ ప్లీనరీలో జగన్‌ నవరత్నాలు పేరుతో తొమ్మిది అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇదే వేదిక నుంచి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తానని కూడా ప్రకటించారు. పాదయాత్రకు ముహూర్తం కూడా ప్రకటించేశారు. కానీ అడుగు ముందుకు పడలేదు.
 
దీనికి ప్రధాన కారణం అక్రమాస్తుల కేసు విచారణకు జగన్ మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం కోర్టుకు రావాలంటూ ఆదేశించడమే. దీంతో ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లి వస్తున్నారు. ఈ కారణంగా జగన్ పాదయాత్ర ప్రారంభానికి నోచుకోలేదు. అందుకే పాదయాత్రను దృష్టిలో ఉంచుకుని తాను కోర్టుకు హాజరుకావడం నుంచి మినహాయింపు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరగా, కోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. 
 
అదేసమయంలో కోర్టు నుంచి అనుమతి పొంది పాదయాత్ర చేస్తే అది అధికార పార్టీకి అస్త్రంగా మారుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో పాదయాత్రకు ప్రత్యామ్నాయంపైనా దృష్టిసారించారు. పాదయాత్రను కాదని ఏం చేస్తే బావుటుందన్న తర్జన భర్జనలు పార్టీ నేతల్లో మొదలయ్యాయి. పాదయాత్రకు ప్రత్యామ్నాయంగా జిల్లాల పర్యటనలు చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ పార్టీలో జరుగుతోంది. కానీ, జగన్ మాత్రం వీలైనంత త్వరగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఆరునూరైనా పాదయాత్రే చేపట్టాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

టిటిడి ఆలయంలో అస్థికలు బయటపడుతున్నాయి...

చిత్తూరు జిల్లా నాగలాపురంలోని వేద నారాయణస్వామి ఆలయంలో మట్టి తవ్వుతుంటే అస్థికలు ...

news

'బాలయ్యా ఇదేం గోలయ్యా' అంటూ మండిపడుతున్న నెటిజన్లు (Video)

సినీ నటుడు బాలకృష్ణ మరోమారు రెచ్చిపోయారు. తనకు కోపం వస్తే ఎలా రెచ్చిపోతోనో మరోమారు ...

news

కడుపులో బంగారం బిస్కెట్లు... మల విసర్జన చేసి 16 బయటకు...

ఆ స్మగ్లర్ మామూలోడు కాదు. బంగారం స్మగ్లింగ్ చాలామంది లోదుస్తుల్లోనో, బెల్టుల్లోనో... ...

news

బెంగుళూరులో చిన్నమ్మకు... చెన్నైలో దినకరన్‌లకు షాక్

అన్నాడీఎంకే అసమ్మతి వర్గం నేత టీటీవీ దినకరన్‌‌ను అరెస్టు చేసేందుకు తమిళనాడు రాష్ట్ర ...

Widgets Magazine