జగన్ పాదయాత్ర.. చంద్రన్న సర్కారు ఉలికిపాటు... ఎందుకు?

శనివారం, 4 నవంబరు 2017 (11:53 IST)

ys jagan

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పాదయాత్ర దెబ్బకు ఏపీలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. దీనికి అనేక కారణాలు లేకపోలేదు. 
 
నిజానికి మన రాష్ట్రంలో పాదయాత్రలు అధికారాన్ని తెచ్చిపెట్టాయి. నాయకులను ప్రజలకు దగ్గరచేశాయి.. పాదయాత్ర పునాదిగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కూడా. ఇది గత చరిత్ర. కానీ, ఇపుడు ఏపీలో మహాసంకల్ప యాత్ర తెరపైకి వచ్చింది. కానీ, ఓ పక్క సర్కారులో అసహనం.. మరో పక్క పాదయాత్రకు సై అంటున్న వైసీపీ శ్రేణులు. వెరసి ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. 
 
నిజానికి ఎన్ని మీటింగులు, ప్రెస్‌మీట్లు పెట్టినా, పాదయాత్రకున్న క్రేజ్ వేరు. పాదయాత్ర ఓ దీక్షలాంటింది. అది నమ్మిన వారికి ఫలితాన్నిచ్చింది. క్రమశిక్షణగా, చిత్తశుద్ధితో ప్రజలముందుకు వెళ్లినవారిని ఆదరించింది. ఇప్పుడు ఏపీలో సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు విపక్షనేత జగన్. గతంలో ఓ పాదయాత్ర తర్వాత బలం పుంజుకున్న చంద్రబాబు.. ఇప్పుడా పాదయాత్ర పట్ల అసహనం వ్యక్తం చేయడం ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేస్తోంది. 
 
మొత్తమ్మీద వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్రకు పక్కా ఏర్పాట్లు చేశారు. ఆ పార్టీ నేతలు విజయవాడలో రూట్ మ్యాప్‌ను కూడా రిలీజ్ చేశారు. నవంబర్ 6వ తేదీ ఉదయం 9 గంటలకు వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయలోని వైఎస్సార్‌ సమాధి వద్ద నివాళులర్పించి, ఆపై ప్రజలను ఉద్దేశించి ప్రసగించాక జగన్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. అయితే, ఈ పాదయాత్రపై చంద్రన్న సర్కారు ఉలికిపాటుకు గురవుతూ లేనిపోని విమర్శలకు ఇప్పటినుంచే దిగడం ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరింత చదవండి :  
Jagan Padayatra November 6 Ysr Congress Chief

Loading comments ...

తెలుగు వార్తలు

news

భోపాల్ నడిబొడ్డున విద్యార్థిని గ్యాంగ్‌ రేప్‌... విరామం తీసుకుంటూ మరీ....

మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నగరం నడిబొడ్డున ఐఏఎస్ పరీక్షల కోసం శిక్షణ తీసుకుంటున్న ...

news

#ChennaiRains : మరో 24 గంటలు వర్షాలే... భయం గుప్పిట్లో జనం చెన్నైవాసులు

గత నెల 27వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో గత ఐదు రోజులుగా ...

news

హిందూ ఉగ్రవాదం కామెంట్స్.. కమల్ హాసన్‌పై కేసులు... అరెస్టు ఖాయమా?

ఈనెల ఏడో తేదీన తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్న విశ్వనటుడు కమల్ హాసన్ చిక్కుల్లో ...

news

మహాభారతం: ''లక్క గృహం'' నుంచి పాండవులు తప్పించుకున్న సొరంగం బయటపడింది..? (వీడియో)

మహాభారతంలో దుర్యోధనుడు పాండవులను అంతం చేసేందుకు లక్క గృహాన్ని నిర్మిస్తాడు. ఆ లక్క గృహంలో ...