శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (17:36 IST)

దీపావళి రోజున తెలుపు రంగు దుస్తులు ధరించి.. పూజచేస్తే?

దీపావళి రోజుల తెలుపు రంగు బట్టలు ధరించి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. దీపావళి రోజున ఉదయం ఐదింటికి నిద్ర లేచి, తలస్నానం చేసి పూజామందిరం ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరంలో అందమైన ముగ్గులతో తీర్చిదిద్దుకోవాలి. తెలుపు బట్టలు ధరించి... దైవ మూర్తుల పటాలకు గంధము, కుంకుమలతో అలంకరించాలి.
 
ఆ తర్వాత ఆకుపచ్చని రంగుతో కూడిన కూర్చున్న శ్రీ లక్ష్మీదేవీ పటాన్నిగానీ, వెండితో తయారైన లక్ష్మీదేవి ప్రతిమను గానీ పూజకు సిద్ధం చేసుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్ర పద్మాలు, తెలుపు కలువ పువ్వులు, గులాబి పువ్వులతో లక్ష్మీదేవి అర్చించాలి.
 
జామకాయలు, రవ్వలడ్డులు, కేసరి బాత్, అరిసెలు వంటి పిండిపదార్థాలను నైవేద్యం పెట్టి శ్రీ లక్ష్మీ అష్టోత్తరము, శ్రీ మహాలక్ష్మీ అష్టకం స్తోత్రాలను పఠించాలి. అంతే కాకుండా శ్రీ సూక్తము, శ్రీ లక్ష్మీ సహస్రనామము, భాగవతము, కనకధారాస్తవము వంటి పారాయణ స్తోత్రాలతో లక్ష్మీదేవిని పూజించాలి. అందులో ముఖ్యంగా భాగవతములోని నరకాసురవధ అధ్యాయమును పారాయణము చేయాలి.
 
దీపావళి రోజున మహాలక్ష్మీ ధ్యానించి విశాఖ కనకమహాలక్ష్మీ దేవి, అష్టలక్ష్మీ దేవాలయం, కొల్హపూర్ వంటి క్షేత్రాలను దర్శించుకుంటే సకల సంపదలు దరిచేరుతాయని విశ్వాసం. ఇదే రోజున కుంకుమ పూజ గావించిన స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం.