శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By PNR
Last Updated : సోమవారం, 4 ఆగస్టు 2014 (17:33 IST)

పిరుదులు భారీగా ఉంటాయి.. స్కర్టులు ధరించవచ్చా?

నా వయస్సు 24 యేళ్లు. ఇంకా వివాహం కాలేదు. ఓ కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తున్నా. సాధారణంగా కుర్తీలు, జీన్స్‌లు ధరిస్తుంటాను. అయితే, నా స్నేహితురాళ్లు మాత్రం ఎక్కువగా స్కర్టులు, మిడ్డీలు ధరిస్తుంటారు. వారిలాగే నేను కూడా స్కర్టులు ధరించవచ్చా. భారీ పిరుదుల కారణంగా స్కర్టు ధరించడం వల్ల ఎబ్బెట్టుగా ఉంటుందా? 
 
చాలా మంది యువతులు తమ శరీరాకృతికి, వేసే డ్రస్‌లకు ఏమాత్రం పొంతన వుండదు. దీంతో చూసేందుకు అంద విహీనంగా కనిపిస్తుంటారు. సాధారణంగా సరైన ఫిట్టింగ్‌తో ఉండే దుస్తుల ద్వారా మీ షేప్‌ను సక్రమంగా మలుచుకోవచ్చు. బస్ట్ లైన్‌కు కిందుగా బెల్ట్ ధరిస్తే నడుము సన్నగా కనిపిస్తుంది. షర్ట్ పొడవు పిరుదుల కిందకు ఉంటే అది కొంత అసౌకర్యంగా ఉంటుంది. 'ఎ' లైన్ స్కర్టులు, నిండు రంగువి ఎంచుకోవడం వల్ల మీ అందాన్ని పరిరక్షించుకోవచ్చు.