శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By pnr
Last Updated : శనివారం, 21 నవంబరు 2015 (15:54 IST)

అందమైన జట్టు కోసం... ఇంట్లోనే హెయిర్ స్పా

ప్రతీ మహిళ ముఖారవిందంతో పాటు కురుల అందంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది. అయితే, తమ వెంట్రుకలు ఏమాత్రం నిర్జీవంగా కనిపించినా నీరసించి పోతుంది. ఈ సమ్యకు ఇంట్లోనే సరిచేసుకోవచ్చు. ఇందుకోసం ఇంట్లోనే హెయిర్ స్పా సిద్ధం చేసుకోవడమే ఏకైక మార్గం. ప్రస్తుతం బయట అనేక రకాలైన స్పాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. వీటికి దూరంగా ఉండేలా ఈ ట్రీట్మెంట్‌లను చూసుకోవచ్చు. అవేంటో ఓ సారి చూద్ధాం. 
 
నిర్జీవంగా కనిపించే వెంట్రుకలకు కొబ్బరి నూనె, ఆలివ్‌ ఆయిల్‌, బాదం నూనెలను సమపాళ్ళలో కలిపి గోరువెచ్చగా వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా మునివేళ్ళతో తీసుకుని కుదుళ్లకు బాగా పట్టించి 10 నుంచి 20 నిమిషాల పాటు నిమిషాల సేపు మర్దన చెయ్యాలి.
 
వేడినీళ్ళలో ఒక టవల్‌ ముంచి నీళ్ళు కారకుండా పిండివేయాలి. గోరువెచ్చగా ఉన్న ఆ టవల్‌ను జుట్టంతా మూసి ఉండేలా తలకు చుట్టుకుని 15 నిమిషాల పాటు ఉండాలి. ఇలాచేయడం వల్ల, అంతకుముందు పట్టించిన ఆయిల్‌ మిశ్రమం జుట్టు కుదుళ్ళకు బాగా ఇంకుతుంది. నూనె పట్టించి స్టీమ్‌ ఇచ్చిన జుట్టును రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు తలస్నానం చెయ్యవచ్చు.
 
షాంపూతో లేదా కుంకుడు కాయలతో తలస్నానం చేసిన తర్వాత జుట్టుకు కండీషనర్‌ అప్లై చేసి ఐదు నిమిషాల తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఇక హెయిర్‌ స్పాలో ఆఖరి ద శ జుట్టుకు ప్యాక్‌ వెయ్యడం. జుట్టు తత్వాన్ని బట్టి ప్యాక్‌ను తయారు చేసుకోవాలి. ఇలా వారానికి ఒక సారి చొప్పున నెలరోజుల పాటు చేసి, ఆ తర్వాత క్రమంగా అవసరాన్నిబట్టి నెలకు ఒకటి రెండు సార్లు చేసుకున్నట్టయితే కురులు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి.