శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By Selvi
Last Updated : శుక్రవారం, 28 నవంబరు 2014 (16:44 IST)

బ్లాక్ టీతో గ్రే హెయిర్ సమస్య మటాష్!!

చిన్న వయస్సులోనే గ్రే హెయిర్ సమస్య ఉంటే, అందుకు బ్లాక్ టీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు పోసి, అందులో టీఆకులు వేసి బాగా మరిగించాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి.
 
తలస్నానం చేసిన తర్వాత ఈ నీటిని తలారా పోసుకోవాలి. బ్లాక్ టీ నీరు తలకు పోసుకొన్న తర్వాత షాంపూ వాడకూడదని గుర్తుంచుకోవాలి. ఈ హోం రెమడీ గ్రే హెయిర్‌ను చాలా సున్నితంగా కవర్ చేసేస్తుంది.
 
అలాగే ఉసిరికాయ, హెన్నాతో తయారు చేసిన మిశ్రమంతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం ద్వారా కొంతవరకు గ్రేహెయిర్‌ను నివారించవచ్చు. హెన్నాను పేస్ట్‌లా తయారు చేసుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల ఉసిరి పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. 
 
ఈ పేస్ట్‌ను జుట్టు మొదళ్ళ వరకూ బాగా పట్టించాలి. 15 నిమిషాల తర్వాత తడి ఆరిపోయాక నాణ్యమైన షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం ద్వారా కేశాలకు నేచురల్ కలర్ పొందవచ్చు.