శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By Selvi
Last Updated : శనివారం, 14 జూన్ 2014 (17:21 IST)

స్ట్రాబెర్రీ, బియ్యం పిండితో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

స్ట్రాబెర్రీ, బియ్యం పిండితో ఫేస్ ప్యాక్ వేసుకుంటే? మీ చర్మం నిగనిగలాడుతుందని బ్యూటీషన్లు అంటున్నారు. స్ట్రాబెర్రీ ప్యాక్‌ వేసుకునేందుకు ముందుగా స్క్రబ్ చేయాలి. ఒక స్ట్రాబెర్రీను రెండు భాగాలుగా మధ్యకు కట్ చేసి , వాటిని తీసుకొని ముఖం మీద మర్ధన చేయాలి . తర్వాత కొన్ని నిముషాలు అలాగే వదిలేసి, తర్వాత చల్లటి నీళ్ళతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అంతే మీకు ముఖంలో తక్షణ మార్పు కనిపిస్తుంది. 
 
తర్వాత ముఖానికి స్ట్రాబెరీ క్రీమ్ రాయాలి. ఇది ఎలా చేయాలంటే మిక్సీలో స్ట్రాబెరీని వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ కు తాజా క్రీమ్‌ను ఒక టేబుల్ స్పూన్ , మరియు ఒక టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేసి, మూడింటిని చిక్కటి పేస్ట్‌లా తయారు చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు పట్టించాలి. అప్లై చేసిన 10 నిముషాల తర్వాత చల్లటి నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. 
 
ఇక ఫేస్ ప్యాక్ సంగతికి వస్తే.. ఐదు ఆరు స్ట్రాబెరీలను మెత్తగా పేస్ట్ చేసి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని చేర్చి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే మీ చర్మం మృదువుగా తయారవుతుంది. 
 
ఇంకా రోజంతా పనిచేసి అలసిపోయిన కళ్ళకు స్ట్రాబెరీ విశ్రాంతినిస్తుంది. స్ట్రాబెరీను రెండుగా కట్ చేసి కళ్ళక్రింద కొద్దిసేపుపెట్టుకోవాలి. పది నిముషాలు కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత స్ట్రాబెరీ స్లైస్‌ను తొలగించి కళ్ళకు మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇలా చేస్తే మీ కళ్లు ప్రకాశవంతంగా ఉంటాయి. అలసినట్లు కనబడవు. 
 
ఇకపోతే.. స్ట్రాబెరీ ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలను నివారించడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అరకప్పు స్ట్రాబెరీలను మెత్తగా పేస్ట్ చేసి, అందులో సోర్ క్రీమ్‌ను మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేసి 10-15నిముషాలు అలాగే ఉంచి , తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేయడంతో మొటిమలు మాయమైపోతాయి.