గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 31 ఆగస్టు 2018 (16:12 IST)

నూలు దారాలతో డోరీ నెక్లెస్‌లా... ఎలా?

నూలు దారాలతో కమ్మలే కాదు నెక్లెస్‌లు కూడా తయారుచేసుకోవచ్చును. మరి ఈ నెక్లెస్‌ల తయారీకి కావలసిన వస్తువులు తెలుసుకుందాం. నలుపు రంగు నూల్ లేదా సిల్క్ దారం, గ్లూ, కత్తెర, ప్లకర్, కటర్, హుక్ చెయిన్ లేదా గో

నూలు దారాలతో కమ్మలే కాదు నెక్లెస్‌లు కూడా తయారుచేసుకోవచ్చును. మరి ఈ నెక్లెస్‌ల తయారీకి కావలసిన వస్తువులు తెలుసుకుందాం. నలుపు రంగు నూల్ లేదా సిల్క్ దారం, గ్లూ, కత్తెర, ప్లకర్, కటర్, హుక్ చెయిన్ లేదా గోడ్డ్ కలర్ దారం వీటితో నెక్లెస్స్‌లు ఎలా చేయాలో చూద్దాం.
  
 
ముందుగా దారాన్ని మెడకు సరిపోయే విధంగా తగిన పొడవులో కొన్ని వరుసలుగా తీసుకోవాలి. వీటన్నింటిని మూడు భాగాలుగా తీసుకుని ఒకవైపుగా ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడు భాగాలను చేర్చి జడలా అల్లుకోవాలి. దారాన్ని అల్లేటప్పుడు పెండెంట్స్‌ను సెట్ చేసుకోవాలి. 

ఆ తరువాత చివరలను కలుపుతూ బంగారు రంగు దారంతో చుట్టుకోవాలి. దారాలు ఊడిపోకుండా గట్టిగా చుట్టుకుని రెండువైపులా కలుపుకుని ఒక పెద్ద పూసను గుచ్చుకోవాలి. చివరగా దారంతో చేసిన టస్సెల్‌ను కలుపుకోవాలి. అంతే డోరీ నెక్లెస్ రెడీ.