శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By
Last Updated : శుక్రవారం, 16 నవంబరు 2018 (17:51 IST)

పోనిటైల్ జడ ఎలా వేయాలంటే..?

స్త్రీలకు ఫంక్షన్స్ వెళ్లాలంటే చాలా ఇష్టం. ఏదైనా ఫంక్షన్ వచ్చిదంటే చాలు దానికి ఎలా రెడీ అవ్వాలో, జడ ఎలా వేసుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. మరి జడ ఏ స్టైల్ వేస్తే బాగుంటుందో చూద్దాం. సాధరణంగా చాలామంది పోనిటైల్ వేసి అలానే వదిలేస్తారు. మరి మనం ఆ పోనిటైల్‌తోనే జడ ఎలా అల్లాలో నేర్చుకుందాం.. రండీ...
 
1. ముందుగా జుట్టును చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. ఆ తరువాత రెండు వైపుల నుండి రెండు పాయల్ని తీసి కొద్దిగా మెలి తిప్పాలి. ఇప్పుడు ఈ రెండు పాయలను ఓ వైపు తెచ్చి రబ్బర్ బ్యాండ్ వేసి ఆ రెండు పాయల పై భాగాన కొద్దిగా వదులు చేయాలి. 
 
2. పైన చెప్పిన విధంగా మరోవైపు పోనీ వేయాలి. మళ్లీ జుట్టును కాస్త వదులు చేయాలి. జుట్టు పొడవుగా ఉండేవారు చివరి వరకు ఇదే విధంగా పోనీ వేస్తూ రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటూ రావాలి. చివరగా జడ మధ్యలో అక్కడక్కడా ముత్యాలలాంటి పూసల్ని అలంకరిస్తే పోనిటైల్ జడ సిద్ధం.