మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By Selvi
Last Updated : మంగళవారం, 24 జూన్ 2014 (14:09 IST)

బత్తాయి రసంతో ఫేస్ బ్లీచ్ ఎలా చేయాలి?

వేసవిలో మొటిమలు తప్పవు. అలాగే కంటి కింద నల్లటి వలయాలు, నల్లని పెదవులు వంటి సమస్యలను ఎదుర్కొంటుంటే బత్తాయి రసంతో ఆలోచించకుండా బ్లీచ్ ట్రై చేయండి. ముందుగా మీ ముఖాన్ని సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. తర్వాత బత్తాయి కాయను రెండు ముక్కలుగా కట్ చేసి, దానిలో ఒక ముక్కను తీసుకోని నెమ్మదిగా మీ ముఖాన్ని ఒక వృత్తాకార మోషన్‌లో స్క్రబ్ చేయాలి.
 
ఈ విధంగా 10-12 నిమిషాలు చేయాలి. ఆ తర్వాత ఒక మృదువైన వస్త్రం లేదా టిష్యూను ఉపయోగించి, మీ ముఖం మీద ఉన్న రసాన్ని మరియు అవశేషాలను రబ్ చేయాలి. తర్వాత నీటితో మీ ముఖంను కడగాలి. 
 
బత్తాయికాయలో ఉండే సిట్రిక్ రసం ఒక సహజమైన తేలికపాటి బ్లీచ్‌గా పనిచేస్తుంది. ఇది బ్లాక్ హెడ్స్‌ను తగ్గిస్తుంది. ఇంకా మీ చర్మ రంధ్రాలను శుభ్రపరచి చర్మం కాంతివంతంగా ఉండటానికి సహాయపడుతుంది. 
 
అదేవిధంగా, మీరు బత్తాయిముక్కతో మీ మెడ, చంకలలో, మోచేతులు మరియు మోకాలు మీద రుద్దటం ద్వారా నల్లదనంను తగ్గించవచ్చు. మీ పెదవులమీద నల్లదనం, పగుళ్ళు తగ్గటానికి బత్తాయి రసంను 3-4 సార్లు రాస్తే ఫలితం ఉంటుందని బ్యూటీషన్లు అంటున్నారు.