శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By
Last Updated : శనివారం, 2 మార్చి 2019 (15:37 IST)

ఐస్‌క్యూబ్స్ కరిగించిన నీటితో ఇలా చేస్తే..?

నెయిల్ పాలిష్ వేసుకునేందుకు టైమ్ లేదా.. అలా వేసుకున్నా పెయింట్ కొట్టేసినట్లు ఆదరా బాదరా వెళ్లిపోతున్నారా... ఇకపై అలా చేయకుండా ఈ సింపుల్ టిప్స్ పాటించండి. 
 
గోళ్ల రంగు వేసినప్పుడు బబుల్స్ ఏర్పడకుండా ఉండాలంటే బాటిల్‌ను ఎక్కువగా ఊపకూడదు. స్నానం చేసిన వెంటనే గోర్లకు నెయిల్ పాలిష్ పెట్టకూడదు. గోళ్లు తడిగా ఉంటే నెయిల్ పాలిష్ ఆరటానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి తడి ఆరిన తరువాత గోళ్లకు రంగు పెట్టుకోవచ్చు.
 
మెరుపుల నెయిల్ పాలిష్ ఆకర్షణీయంగానే ఉంటుంది. కానీ గోళ్ల నుండి వదిలించుకోవడానికి ఎక్కువ టైమ్ పడుతుంది. ఆ పని చిటికెలో అయిపోవాలంటే ఫెల్ట్ క్లాత్‌తో మెరుపులపై రుద్దాలి. దెబ్బకు తేలికగా ఊడొస్తాయి. 
 
పాలిష్ వేసుకున్న గోళ్లను ఐస్ క్యూబ్స్ కరిగించిన చల్లని నీళ్లలో ముంచేయండి. వేసుకున్న రంగు చిటికెలో ఆరిపోతుంది. నెయిల్ ఆర్ట్ వేసుకునే ముందు క్యూటికల్స్ మీద నూనె రాయండి. పెయింట్ పక్కకు ఒలికినా తేలికగా తుడిచేయవచ్చు.
 
నెయిల్ స్టిక్కర్స్ వాడేటప్పుడు వాటిని గోరు అంచుల దాకా అంటించాలి. దాని మీద పూసే టాప్ కోట్ నెయిల్ పాలిష్ గోరు అంచుల వరకూ వేయాలి. అలా చేస్తే అంచుల నుంచి రంగు ఊడకుండా తాజా నెయిల్ పాలిష్ లుక్ వస్తుంది.