శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By PNR
Last Updated : సోమవారం, 17 ఆగస్టు 2015 (16:15 IST)

సుగంధ - ఔషధ తత్వ గుణాలు కలిగిన గంధం!

దేశంలో పూజలు, పుణ్యకార్యాలకు, దేవుళ్ల అలంకారాలకు గంధాన్ని ఒక సుగంధ ద్రవ్యంగా వినియోగిస్తుంటారు. ఈ అలవాటు ఎన్నో వేల సంవత్సరాలుగా ఉంది. దీనిని స్త్రీ పురుషులు తేడా లేకుండా శరీరంపై లేపనంగా, పసుపు కలిపి తిలకంగా, బొట్టుగా పెట్టుకుంటారు. కొన్ని గుళ్లలో వీటిని తప్పకుండా దేవుడికి రాస్తుంటారు. ఏది ఎలా ఉన్నా గంధంలోని సుగంధతైలాలు - ఔషధ తత్వాలు, అరుదుగా దొరకడం వల్ల ఖరీదైన సుగంధ ద్రవ్యంగా పూర్వం పరిగణిస్తున్నారు. 
 
ఆయుర్వేదంలో గంధాన్ని చందనం అని కూడా పిలుస్తారు. ఇది ఎర్రచందనం, తెల్లచందనం అని రెండు రూపాల్లో ఉంటుంది. వీటిని ఎర్రచందనం అనే దానిని పరికరాలు, బొమ్మల తయారీకి వాడుతుంటారు. దీని నుంచి నూనెను సేకరిస్తారు. తెల్లచందనంతో సుగంధ ద్రవ్యాలు, ఔషధాల తయారికీ సెంట్ల తయారీకీ, సబ్బుల తయారీకీ వాడుతుంటారు. ఎర్రచందనం నూనెను చందనాన్ని ఔషధాల తయారీకి వాడుతుంటారు. ఆయుర్వేద మందుల్లోనూ ఇస్తుంటారు. మనం వాడే విధానాన్ని బట్టి తైలాలు పనిచేస్తుంటాయి. దీనిని శ్రీ గంధం అని కూడా అంటారు.
 
గంధాన్ని ఎండాకాలంలో నలుగులో కలిపి రుద్దుకుంటే చర్మం మృదువుగా దుర్గంధ రహితంగా ఉంటుంది. గంధం నుంచి తీసిన నూనెను, నీళ్లలో 5-6 చుక్కలు వేసి స్నానం చేస్తే శరీర బడలిక తగ్గుతుంది. ఈ తైలాన్ని నూనెలో కలిపి వత్తిగా చేసి దీపం పెట్టినా, దీనితో చేసిన అగరు వత్తి వెలిగించినా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. గంధం అరగదీసి అర చెంచాడు పేస్ట్‌ను నీళ్లలో కలిపి తీసుకుంటే మూత్రంలో మంట, శరీరంలో ఆవిర్లు, మంటలు, పిత్త వికారాలు తగ్గుతాయి. గంధపు నూనెను ఇతర తైలాలతో కలిపి వాడుకోవాలి.