శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By Selvi
Last Updated : శనివారం, 13 సెప్టెంబరు 2014 (15:31 IST)

మహిళలు బ్యాగులు, షూలు ఎలా ధరించాలంటే?

మహిళలు బ్యాగులు, షూల ఎంపిక వాటిని ధరించే విషయంలో క్లారిటీ కావాలా.. అయితే చదవండి. మంచి వస్త్రాలు ధరించి సరైన యాక్ససరీలు లేకుంటే ఫ్యాషన్ ప్రపంచంలో ఆ లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. 
 
బ్యాగులు మరీ పెద్దవిగా ఉంటే అవి అందరిదృష్టిని అటే మరులుతుంది. స్టయిల్, రంగు, టెక్చర్‌లను జాగ్రత్తగా ఎంచుకోవాలి. చెయిన్ బ్యాగులు నేటి ట్రెండ్. యానిమల్ ప్రింట్స్ కూడా ఫ్యాషన్ పోకడల్లో ఇప్పుడొక భాగం. మెటల్ లేదా ప్లాస్టిక్ చైన్లు ఎంచుకోవచ్చు. 
 
నాసిరకం లెదర్ బ్యాగుల్ని కాక నాణ్యమైన వాటి కోసమే ప్రయత్నించండి. ఈ సీజన్‌కు హైహీల్స్ అనువైనవి. అలవాటులేని వారు ఓ మాదిరి హీల్స్‌ను ఎంచుకోవచ్చు. ఫ్లాట్‌గా ఉండే రకాలయితే వానజల్లుల తడి పాదాలకు అంటి చికాకు పెడుతుంటాయి. మడమలపై రిబ్బన్ స్ట్రాప్స్‌గల షూస్ స్టయిలిష్‌గా ఉంటాయి.