మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2014 (17:07 IST)

మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లకు నాయకత్వ లక్షణాలు..

మగవాళ్లతో పోలీస్తే ఆడవాళ్లు వైవిధ్యమైన నాయకత్వ లక్షణాలు కలిగివుంటారట. అందుకే మహిళా బాస్‌లు ఉన్న సంస్థ విజయ పథంలో దూసుకుపోతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. మహిళా ప్రత్యేకతలేంటో వివరించింది. 
 
మగవాళ్లు చూడటానికి ధైర్యవంతుల్లా కనిపించినా, పని విషయంలో మాత్రం ఆడవాళ్లే కొత్త కత్త సవాళ్లని ఎదుర్కోవడంలో ముందుంటారు. మగవాళ్లకు ఏదైనా సవాల్ ఎదురైనప్పుడు దానిని కేవలం తమ కోణంలోంచి మాత్రమే చూస్తారు.

కానీ మహిళా బాస్‌లు ఒక సమస్యని వేర్వేరు కోణాల్లోంచి చూడగలుగుతారని, ఒక విషయాన్ని ఇతరులకు అనునయించి చెప్పడంలోనూ ముందుంటారని అధ్యయనం తెలిపింది.