బ్రెడ్‌తో గారెలు ఎలా చేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ - 5 మెుక్కజొన్న పిండి - 4 స్పూన్స్ ఉప్పు - సరిపడా కొత్తిమీర - అరకప్పు కరివేపాకు - కొద్దిగా వంటసోడా - 1/2 స్పూన్ పచ్చిమిర్చి - 3 నూనె - సరిపడా తయారీ విధానం: ముందుగ

Kowsalya| Last Updated: గురువారం, 9 ఆగస్టు 2018 (17:21 IST)
కావలసిన పదార్థాలు:
బ్రెడ్ స్లైసెస్ - 5
మెుక్కజొన్న పిండి - 4 స్పూన్స్
ఉప్పు - సరిపడా
కొత్తిమీర - అరకప్పు
కరివేపాకు - కొద్దిగా
వంటసోడా - 1/2 స్పూన్
పచ్చిమిర్చి - 3
నూనె - సరిపడా

తయారీ విధానం:
ముందుగా బ్రెడ్ స్లైసెస్‌లో గల బ్రౌన్ స్లైసెస్‌ను తీసివేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. ఆ తరువాత అందులో మెుక్కజొన్న పిండి, ఉప్పు, వంటసోడా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని కొద్దిగా నీటిని పోసుకుని వడపిండిలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక ఆ బ్రెడ్ మిశ్రమాన్ని వడల్లా చేసుకుని నూనెను వేయించుకోవాలి. అంతే బ్రెడ్ వడ రెడీ.దీనిపై మరింత చదవండి :