శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By
Last Updated : బుధవారం, 17 జులై 2019 (15:19 IST)

వర్షాకాలం.. పిల్లలకు తెగ నచ్చే నాటుకోడి శాండ్ విచ్

వర్షాకాలం వచ్చేసింది.. పిల్లలకు నచ్చే విధంగా చికెన్ శాండ్ విచ్ ఎలా తయారు చేయాలో చూద్దాం.. సాధారణంగా చికెన్‌లో ప్రోటీన్లు పుష్కలంగా వుంటాయి. ముఖ్యంగా అయితే నాటుకోడి అంటే ఇంకా బలాన్నిస్తుంది. బ్రాయిలర్ చికెన్ మాంసం కాకుండా.. నాటుకోడి ముక్కలతో పిల్లలకు నచ్చే శాండ్‌విచ్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. 
 
కావలసిన పదార్థాలు 
బోన్ లెస్ నాటుకోడి ముక్కలు- పావుకేజీ 
బ్రెడ్‌ స్లైసులు - పన్నెండు,
ఉల్లిపాయ తరుగు- అరకప్పు
పచ్చిమిర్చి తరుగు- రెండు టీ స్పూన్లు. 
పుదీనా తరుగు- చెంచా, 
చీజ్‌ స్లైసులు- ఆరు, 
చిల్లీసాస్‌ - రెండు చెంచాలు, 
మిరియాలపొడి - చెంచా
వెన్న - అరకప్పు, 
మయొనైజ్‌- మూడు చెంచాలు, 
ఉప్పు- రుచికి సరిపడా. 
 
తయారీ విధానం: 
ముందు శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలకు మిరియాలపొడి, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు చేర్చి ఉడికించి పెట్టుకోవాలి. దీన్ని ఒకసారి మిక్సీ పట్టాలి. తర్వాత పుదీనా తరుగూ, మయొనైజ్‌, తగినంత ఉప్పూ, చిల్లీసాస్‌ కలిపి ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి. అలాగే బ్రెడ్‌స్లైసుల్ని పెనంపై ఉంచి.. వెన్నతో కాల్చి తీసుకోవాలి.

ఒక స్లైసుపై చీజ్‌ స్లైసు, ఉల్లిపాయ ముక్క ఉంచాలి. మధ్యలో చికెన్‌ మిశ్రమాన్ని ఉంచి.. మరో స్లైసుతో మూసేస్తూ దోరగా వేపుకుని సర్వింగ్ ప్లేటులోకి తీసుకోవాలి. కావాలంటే లైట్‍‌గా నిమ్మరసం పిండి.. సాస్‌తో నాటుకోడి శాండ్ విచ్‌ను సర్వ్ చేయాలి. టేస్ట్ అదిరిపోతుంది.