గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By Selvi
Last Updated : మంగళవారం, 19 మే 2015 (15:32 IST)

మష్రూమ్స్ టేస్టీ డీప్ ఫ్రై రెసిపీ

క్యాన్సర్‌ను మష్రూమ్స్ నియంత్రిస్తాయి. డయాబెటిస్‌ను, గుండె సమస్యలను మష్రూమ్స్ దరిచేరనివ్వవు. అలాంటి పోషకాలతో కూడిన మష్రూమ్‌ను టేస్టీ డీప్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావల్సిన పదార్థాలు:  
ఉల్లి తరుగు - ఒక కప్పు 
మష్రూమ్స్ - రెండు కప్పులు 
వెల్లుల్లి అల్లం పేస్ట్ - ఒక స్పూన్ 
పెప్పర్, కారం - ఒక స్పూన్ 
కాప్సికం ముక్కలు - అరకప్పు 
నూనె, ఉప్పు - తగినంత 
కొత్తిమీర - గార్నిష్‌కు 
 
తయారీ విధానం: 
ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లి ముక్కలను ఫ్రై చేయాలి అందులోనే వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అందులో క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ ఫ్రై అవుతున్నప్పుడు, మధ్యలోనే పెప్పర్ పౌడర్, కొద్దిగా ఉప్పు, కారం లేదా ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. 
 
క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు మెత్తగా వేగిన తర్వాత పాన్‌లో మష్రుమ్ ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మీడియం మంట మీద మరికొద్దిపేపు ఫ్రై అవ్వనివ్వాలి. మష్రుమ్ మెత్తగా ఉడికినట్లైతే, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే టేస్టీ మష్రూమ్ డీప్ ఫ్రై రెడీ అయినట్లే.