శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By selvi
Last Updated : మంగళవారం, 13 జూన్ 2017 (16:45 IST)

ఓట్స్, బాదం వీట్ దోసెతో బరువు తగ్గండి..

ముందుగా ఓ గిన్నెలో బియ్యం, గోధుమ, ఓట్స్ పౌడర్లను బాగా కలుపుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి, బాదం తురుము, పెప్పర్ పౌడర్, తగినంత ఉప్పు, నీళ్ళు వేసి బాగా కలిపి రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం పాన

ఓట్స్, బాదం, వీట్‌లలో ఫైబర్ పుష్కలంగా వుండటం ద్వారా బరువు సులభంగా తగ్గొచ్చు. వీటిలోని గుడ్ ఫ్యాట్, లో కెలోరీస్ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతాయి. అందుకే ఈ మూడింటి కాంబినేషన్‌లో హెల్దీ బ్రేక్ ఫాస్ట్ దోసె రిసిపీని ట్రై చేయండి.  
కావలసిన పదార్థాలు : 
బియ్యం పిండి: మూడు కప్పులు
గోధుమ పిండి: మూడు కప్పులు
ఓట్స్ పౌడర్: రెండు కప్పులు
బాదం తురుము : అరకప్పు
పచ్చిమిర్చి తరుగు :  మూడున్నర స్పూన్ 
పెప్పర్ పౌడర్: ఒకటిన్నర స్పూన్ 
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
 
తయారీ విధానం : 
ముందుగా ఓ గిన్నెలో బియ్యం, గోధుమ, ఓట్స్ పౌడర్లను బాగా కలుపుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి, బాదం తురుము, పెప్పర్ పౌడర్, తగినంత ఉప్పు, నీళ్ళు వేసి బాగా కలిపి రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం పాన్ తీసుకొని స్టౌ మీద పెట్టి, నూనె రాయాలి. పాన్ వేడయ్యాక గరిటతో పిండితీసుకొని దోసెలా పోసుకోవాలి. మీడియం మంటమీద రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వుంచి.. ఆపై కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.