శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By Sevli
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2014 (18:26 IST)

హెల్దీ అండ్ టేస్టీ వెరైటీ వెజిటబుల్ ఓట్స్ ఉప్మా!

ఓట్స్‌లో క్యాలెరీలు తక్కువ. బరువును తగ్గించడంలో ఓట్స్ బాగా పనిచేస్తుంది. ఇందులోని ఫైబర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాంటి ఓట్స్‌తో వెరైటీగా వెజిటబుల్స్‌తో హెల్దీ ఉప్మా చేసుకోవాలంటే ఈ రిసిపీ ట్రై చేసి చూడండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే ఈ మసాలో ఓట్స్‌లో వేసే క్యారెట్, క్యాప్సికమ్, టమోటో, బీన్స్, కొంచెం వెరైటీ టేస్ట్‌ను అందిస్తాయి. 
 
ఎలా చేయాలంటే..?
కావల్సిన పదార్థాలు:
ఓట్స్: నాలుగు కప్పులు 
ఉల్లిపాయ తరుగు : అరకప్పు 
అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక టేబుల్ స్పూన్లు
ఆవాలు : అర టీ స్పూన్
కరివేపాకు : రెండు రెమ్మలు  
పచ్చిమిర్చి తరుగు : రెండు టీ స్పూన్లు  
టమోటో తరుగు :  అరకప్పు 
పసుపు: ఒక చిటికెడు
గరం మసాలా: ఒక చిటికెడు
క్యారెట్ : పావు కప్పు
క్యాప్సికమ్: పావు కప్పు 
బీన్స్ : పావు కప్పు 
నూనె, ఉప్పు : తగినంత 
 
తయారీ విధానం : 
ముందుగా కుక్కర్లో కూరగాయ (క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్) ముక్కలన్నీ వేసి, కొద్దిగా ఉప్పు వేసి ఒక విజిల్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, అందులో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి దోరగా వేపుకోవాలి. 
 
అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి మరో రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి. ఇందులో టమోటో ముక్కలు, ఉప్పు, పసుపు, గరం మసాలా కూడా వేసి మరో రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కుక్కర్‌లో ఉడికించి పెట్టుకొన్న వెజిటేబుల్స్ వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. 
 
మొత్తం వెజిటేబుల్స్ ను 1-2నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ ఉడికించిన నీటిని ఓట్స్‌లో మిక్స్ చేసి కొద్దిసేపు ఉడకించి తర్వాత వేగుతున్న మసాలాలో పోయాలి. తర్వాత కొత్తిమీర తరుగుతో గార్నిష్‌ చేసుకోవాలి.