శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By Selvi
Last Updated : గురువారం, 11 డిశెంబరు 2014 (19:21 IST)

స్టఫ్డ్ వెజిటేబుల్ అండ్ బటర్ బ్రెడ్ రిసిపీ ట్రై చేయండి!

స్ట్రీట్ ఛాట్స్‌తో అనారోగ్యం తప్పదు. అందుచేత అనారోగ్యం నుంచి దూరంగా ఉండాలంటే.. ఇంట్లోనే టేస్టీ స్నాక్స్ ఈజీ అండ్ హెల్దీగా ట్రై చేయిండి. అలాంటి హెల్దీ స్నాక్స్‌లో స్టఫ్డ్ బటర్ బ్రెడ్‌ను ఎలా చేయాలో చూద్దాం.. 
 
స్టఫ్డ్ వెజిటేబుల్ అండ్ బటర్ బ్రెడ్ రిసిపీ ఎలా చేయాలంటే?
 
కావలసిన పదార్థాలు: బ్రెడ్ పీసెస్: 10 
బటర్ : అరకప్పు
ఉల్లిపాయ తరుగు :  ఒక కప్పు 
కొత్తిమీర తరుగు : కొద్దిగా 
పచ్చిమిర్చి తరుగు : పావు కప్పు 
ఉప్పు: రుచికి 
సరిపడా నూనె: డీప్ ఫ్రైకి సరిపడా 
 
తయారీ విధానం : ముందుగా బటర్, ఉల్లిపాయ, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి, ఉప్పు ఒక బౌల్లో వేసుకొని మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. తర్వాత ప్రతి ఒక్క బ్రెడ్ స్లైస్ తీసుకొని జస్ట్ ఒకసారి నీళ్లలో రెండు నిమిషాలు డిప్ చేసి, నీరు పిండేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ బ్రెడ్ స్లైస్‌ను ఒక ప్లేట్‌లో పెట్టి, ఒక్క బ్రెడ్ స్లైస్ మీద ముందుగా తయారుచేసి పెట్టుకొన్న స్టఫింగ్ మిశ్రమాన్ని పెట్టి, తర్వాత మరో బ్రెడ్ స్లైస్ పెట్టాలి. 
 
పెట్టిన తర్వాత అన్ని వైపులా ప్రెస్ చేసి, స్టఫింగ్ మిశ్రమం బయటకు రాకుండా ప్రెస్ చేయాలి.  అన్ని వైపులా క్లోజ్ చేయాలి. తర్వాత ఒక డీప్ పాన్ తీసుకొని అందులో సరిపడా నూనె వేసి వేడయ్యాక స్టఫ్ చేసిన బ్రెడ్ పాన్‌లో పెట్టి రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేడి చేయాలి. అంతే వేడి వేడిగా పిల్లలకు అందరికి నచ్చే వెజిటబుల్ బటర్ బ్రెడ్ రెడీ!