బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By Selvi
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (11:18 IST)

బ్రెస్ట్ క్యాన్సర్‌ను దూరం చేసే చెరకు రసంతో ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలి..?

చెరకు రసంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. చెరకు రసంలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. చెరకు రసాన్ని సేవించడం ద్వారా క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. క్య

చెరకు రసంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. చెరకు రసంలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. చెరకు రసాన్ని సేవించడం ద్వారా క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. క్యాన్సర్ కణతులతో పోరాడి.. ముఖ్యంగా ప్రోస్టేట్, బ్రెస్ట్ క్యాన్సర్లను ఇది దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి చెరుకు రసంతో శరీరానికి చలవనిచ్చే పుచ్చకాయ, దోస ముక్కలను కలిపి సలాడ్ చేస్తే ఎలా వుంటుందో ట్రై చేద్దాం.. 
 
కావలసిన పదార్థాలు: 
పుచ్చకాయ ముక్కలు : ఒకటిన్నర కప్పు 
చెరకురసం - మూడు కప్పులు, 
దానిమ్మగింజలు - కప్పు,
అల్లం తరుగు - అరచెంచా, 
నిమ్మరసం- రెండు టేబుల్‌స్పూన్లు.
దోసకాయ ముక్కలు - అర కప్పు
 
తయారీ విధానం :
ఓ పెద్ద బౌల్‌లో పుచ్చకాయ, దానిమ్మ గింజలు,  అల్లం తరుగు, నిమ్మరసం, దోస ముక్కలు వేస్తే నోరూరించే చెరకు రసంతో ఫ్రూట్ సలాడ్ సిద్ధమైనట్లే. కావాలనుకుంటే దీనిపై డ్రైఫ్రూట్స్‌ కూడా అలంకరించుకోవచ్చు. కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవచ్చు.