Widgets Magazine

తెలుగు ప్రజలతో ఈ ఉగాది సంబరాన్ని BRU జరుపుకుంటోంది ప్రేమగా మరియు వెచ్చగా....(Video)

మంగళవారం, 28 మార్చి 2017 (12:48 IST)

హైదరాబాద్: భారతీయులు తమ పండుగల పట్ల ఎంత భక్తిశ్రద్ధలను, ప్రేమను కనబరుస్తారో తెలుసు. చిన్న పండుగ నుంచి పెద్ద పండుగ వరకూ మహోత్సవంలా నిర్వహించుకుంటారు. ప్రతి ఇల్లు సంతోషాలతో నిండిపోతుంది. ఉగాది... అంటే సంవత్సరాది. ఈ పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్నాటక రాష్ట్రాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో, పంచాంగ శ్రవణంతో చేసుకుంటారు. ఉగాది లేదా యుగాది అంటే 'కొత్తదనాకి నాంది' అని మన శాస్త్రాలు చెప్పే మాట.
Love is BRU
 
ఉగాది పండుగ వస్తుందనగానే తెలుగు రాష్ట్రాల్లోనే కాక కన్నడిగులు కూడా తమతమ ఇళ్లను శుభ్రపరిచి ముగ్గులు పెట్టి తోరణాలు కట్టి, ఇంటికి కావలసిన అన్ని హంగులను అద్దుతారు. ఉగాది నాటి ప్రత్యేకం ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఈ ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. బెల్లం, మామిడి ముక్కలు, వేప పూత, చింతపండుతో పాటు ఉప్పు, కాస్తంత కారం వేసి ఆరు రుచుల సమ్మేళనంగా ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. 
 
శ్రీ హేవళంబి నామ ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాల్లో రేపు జరుపుకోబోతున్నారు. ఇటీవలే 12 ఏళ్లకోసారి వచ్చే కృష్ణా పుష్కరాలను కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాక దేశవిదేశాల్లో వున్న తెలుగువారు ఘనంగా నిర్వహించుకున్నారు. కృష్ణమ్మ నది ఒడ్డున వేలమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. సుమారు 3 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఆ సందర్భంలో తన వంతు ప్రేమాప్యాయతలను పంచుతూ పవిత్ర కృష్ణానది ఒడ్డుకు వచ్చింది. తన వేడి కమ్మదనాల ప్రేమను పంచింది. అలాగే ఈ ఉగాది నాడు కూడా BRU ఈ ఆనందోత్సవాల కేళిలో తన ప్రేమను పంచేందుకు వస్తోంది. 'ప్రేమంటే BRU' అనే ఫిలాసఫితో ఈ పండుగను మరింత ఉత్సాహవంతంగా ఓ కప్పు బ్రూ కాఫీతో ముందుకు వస్తోంది. 
 
గతంలో కృష్ణా పుష్కరాల సమయంలో కూడా బ్రూ తన సంప్రదాయాన్ని, ప్రేమాప్యాయతల స్నేహంతో BRU ఇన్‌స్టంట్ కాఫీ మేజికల్ కప్స్‌తో సంబరాలు చేసింది. ఈ కప్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల వద్దకు తన సందేశాలను మోసుకెళ్లాయి. ఇక ఈ ఉగాది నాడు ప్రత్యేకమైన సెన్సిటివ్ టెక్నాలజీతో తయారుచేయబడిన కప్స్‌తో రాబోతోంది. వీటి ప్రత్యేకత ఏమిటంటే... BRU కాఫీని కప్పులలో పోస్తుండగానే తెలుగు ప్రజలకు ప్రేమాప్యాయతను పంచే ఉగాది సందేశాన్ని మేజికల్ కప్స్ మెల్లగా ఆవిష్కృతం చేస్తాయి. ఈ వేడుకనాడు చూడ ముచ్చటగొలిపే 40 లక్షల కాఫీ కప్పులతో BRU తన ఆనందాన్ని, సంతోషాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలకు పంచేందుకు ముందుకు వస్తోంది. ఈ ఉగాది సందర్భంగా BRU తెలుగు ప్రజలందరికీ ఆనందాన్ని, శ్రేయస్సును, సుఖసంతోషాలను అందించాలని కోరుకుంటోంది. ఈ వీడియోను వీక్షించి మరింత తెలుసుకోండి.
 

చూశారు కదా, మీరెక్కడ వున్నారన్నది కాదు, తెలుగు రాష్ట్రాల మధ్య వున్న భౌగోళిక సరిహద్దులను మరిచిపోతూ ప్రేమాప్యాతలను పంచే ఈ BRU కప్పు కాఫీ షేర్ చేయండి. మీకు, మీ కుటుంబానికి, తెలుగు ప్రజలందరికీ ఇవే మా ఉగాది శుభాకాంక్షలు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

ఉగాది రోజున పచ్చడిని తొలిజాములోనే తీసుకోవాలి: పూజ.. ఉదయం 9 గంటల్లోపే పూర్తి చేయాలి.

ఉగాది రోజున సూర్యోదయానికి ముందే లేచి ఇంటిశుభ్రం చేసుకుని ఇంటికి ముందు మామిడి తోరణాలు, ...

news

ఉగాది రోజున ఏం చేయాలి...?

వసంత ఋతువు వచ్చేసింది. చెట్లు కొత్త సోయగాలతో ప్రకృతిని హరితవర్ణం చేస్తాయి. కోయిలలు ...

news

తిరుమల వైభవంపై బాహుబలి వంటి వీడియో: ప్రపంచ వ్యాప్తంగా సంచలనం

తిరుమల శ్రీనివాసుడి వైభవంపై ఎన్జీసీలో సోమవారం రాత్రి ప్రసారమైన ‘ఇన్‌సైడ్‌ తిరుమల తిరుపతి’ ...

news

హనుమంతునికి మంగళవారం తమలపాకు మాలను ఎందుకు సమర్పిస్తారు?

విష్ణుమూర్తి అలంకార ప్రియుడైతే.. ముక్కంటి అభిషేక ప్రియుడు. అదే హనుమంతుడైతే.. స్తోత్ర ...

Widgets Magazine