గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By Selvi
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2016 (17:51 IST)

30న మహాలయ అమావాస్య రోజున అన్నదానం చేయండి.. కాకికి, ఆవుకు..?

మహాలయ అమావాస్య రోజున అన్నదానం చేయడం మంచిది. మనుష్యులకే అన్నదానం చేయకుండా జంతుజాలానికి కూడా పెట్టాల్సి వుంటుంది. కాకి, ఆవు వంటి ఆహారం పెట్టాలి. ''లోకానం నరజన్మం దుర్లభం'' అంటారు.. ఎన్నో వేల జన్మలకు గాన

మహాలయ అమావాస్య రోజున అన్నదానం చేయడం మంచిది. మనుష్యులకే అన్నదానం చేయకుండా జంతుజాలానికి కూడా పెట్టాల్సి వుంటుంది. కాకి, ఆవు వంటి ఆహారం పెట్టాలి. ''లోకానం నరజన్మం దుర్లభం'' అంటారు.. ఎన్నో వేల జన్మలకు గానీ నరజన్మ ప్రాప్తించదు. అలాంటి జన్మనిచ్చిన మన పూర్వీకులను గుర్తించుకోవాలి. అందుకే పితృపక్షంలో కనీసం ఒకరోజైనా వారికి తర్పణం వదలాలి. సాధ్యం కానివారు మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు పూజలు చేసి వారిని స్మరించుకోవడం చేస్తే శుభ ఫలితాలు చేకూరుతాయి.
 
పౌర్ణమిలో ప్రారంభమై భాద్రపద మాసంలో చివరి రోజుల్లో వచ్చే అమావాస్యనే మహాలయ అమవాస్యగా పరిగణిస్తారు. పితృపక్షంలో పితృదేవతలు భగవాన్‌ శ్రీ మహావిష్ణువు అనుమతితో భూమికి వస్తారని.. వారి సంతృప్తి పరిచేందుకు ఆ రోజున తర్పణం ఇవ్వాలని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. కనీసం ఒక్క పేదవానికయినా అన్నదానం చేయాలని పురాణాలు చెప్తున్నాయి.
 
మహాలయ పక్షంలో ఆచారం ఉన్నవారు యథావిధిగా అన్న సంతర్పణ, పితృశ్రాద్ధాలు నిర్వర్తించవచ్చు. ఇప్పటిదాకా ఆ అలవాటు లేనివారు కనీసం ఏదైనా దేవాలయంలో బియ్యం, కూరగాయలు, ఉప్పు, పప్పు, పండ్లు దక్షిణ తాంబూలాదులతో విప్రులకు స్వయంపాకం సమర్పించడం లేదా పేదలకు అన్నదానం చేయవచ్చు. ఇలా చేస్తే పితృదేవతల ఆశీస్సులతో ఎంతోకాలంగా తీరని కోరికలు తప్పక నెరవేరతాయని విశ్వాసం. 
 
పితురులను తృప్తి పరచేందుకు మహాలయ అమావాస్యకు మించిన శుభదినం ఉండదు. ఈ కర్మల ద్వారా పితృ రుణం తీర్చుకునే అవకాశం ఇదని గుర్తించాలని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.