శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By Selvi
Last Updated : బుధవారం, 17 ఆగస్టు 2016 (15:25 IST)

రక్షాబంధనం.. అలెగ్జాండర్‌ను కాపాడింది.. అక్బర్ కాలంలోనూ రాఖీ పౌర్ణిమ..

శ్రావణ పూర్ణిమను "సంతోషి మాత జన్మదినోత్సవం" నిర్వహిస్తారు. రక్షాబంధనం అపురూపమైన పండుగ. వినాయకుడి పుత్రులైన లాభం, క్షేమం తమ తండ్రి దగ్గరకు వెళ్లి, తమకు ఓ సోదరి కావాలని కోరుకుంటారు. వారి ఆకాంక్ష విన్న గ

శ్రావణ పూర్ణిమను "సంతోషి మాత జన్మదినోత్సవం" నిర్వహిస్తారు. రక్షాబంధనం అపురూపమైన పండుగ. వినాయకుడి పుత్రులైన లాభం, క్షేమం తమ తండ్రి దగ్గరకు వెళ్లి, తమకు ఓ సోదరి కావాలని కోరుకుంటారు. వారి ఆకాంక్ష విన్న గణపతి కళ్ల వెంట ఆనంద బాష్పాలు జాలువారి, హస్తంలోని పద్మంలో పడతాయి. అందులో నుంచి పద్మముఖి వంటి ఓ బాలిక ఆవిర్భవిస్తుంది. సంతోష సూచకంగా, ఆ బాలికకు ‘సంతోషి’ అని నారదుడు నామకరణం చేస్తాడు. అనంతరం తమ సోదరి సంతోషితో లాభ, క్షేమాలు రక్షాబంధన వేడుక జరుపుకొన్నారు.
 
 రాక్షసులు, దేవతల సంగ్రామంలో పరాజయం పాలవకుండా- ఇంద్రుడికి శచీదేవితో రక్షధారణను దేవగురువు బృహస్పతి చేయించాడని పురాణాలు చెప్తున్నాయి. తమకు విజయం లభించేలా, కృష్ణుడి సలహా మేరకు ధర్మరాజు తన సోదరులతో కలిసి రక్షాబంధన ఉత్సవం నిర్వహించాడని ''మహాభారతం'' చెబుతుంది. 
 
దేవతల కోరిక మేరకు దానశీలుడు, మహా బలశాలి, రాక్షసరాజైన బలి చక్రవర్తిని విష్ణువు తన శక్తితో బంధించాడు. ఆ తరవాత విష్ణుశక్తిని ఓ రక్షాబంధనంలోకి ఆపాదించాడట. ‘నిన్ను బంధించే ఈ రక్ష నిన్ను సర్వదా రక్షిస్తుంది. ఈ రక్షాబంధనాన్ని ధరించినవారికి సర్వదా శుభ పరంపర కొనసాగుతుంది’- అని విష్ణువు శుభ దీవెన అనుగ్రహించాడని పురాణాలు వర్ణిస్తున్నాయి.
 
చారిత్రకంగా రక్షాబంధనానికి అత్యంత ప్రాధాన్యముంది. అలెగ్జాండర్‌ మన దేశంపై దండయాత్రకు వచ్చినప్పుడు, పురుషోత్తమ చక్రవర్తితో యుద్ధానికి దిగాడు. ఓటమి అంచుకు వెళ్లాడు. అలెగ్జాండర్‌ ప్రేయసి రుక్సానా, పురుషోత్తముడికి రక్షాబంధనం కట్టి శరణువేడింది. దాంతో, అలెగ్జాండర్‌కు పురుషోత్తముడు ప్రాణభిక్ష పెట్టాడని చరిత్ర ప్రకారం తెలుస్తోంది. అక్బర్‌ కాలంలో రక్షాబంధన వేడుక పెద్ద ఉత్సవంగా జరిగేదని చరిత్ర చెప్తోంది.