శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 ఆగస్టు 2015 (16:05 IST)

రక్షాబంధన్: భర్తకు కూడా భార్య రాఖీ కట్టవచ్చట!

"రక్షాబంధన్" శ్రావణ పూర్ణిమనాడు వస్తుంది. ఈ పండుగ రోజున సోదరులకు రాఖీ కట్టే చెల్లాయిలే మనకు ఎక్కువగా కన్పిస్తుంటారు. తమ మర్యాదలకు ఎలాంటి భంగం కలగకుండా చివరి వరకు కాపాడే రక్షకులుగా సోదరులుండాలని ఆకాంక్షిస్తూ రాఖీని కట్టడం సంప్రదాయం. 
 
అయితే సోదరులకే కాకుండా.. భర్తకు కూడా భార్య రాఖీ కట్టవచ్చునని, రాఖీకి చాలా పవిత్రత ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రాఖీకి ఉన్న పవిత్రత ఏమిటంటే? భార్య-భర్తకు, సోదరి-సోదరులకు కట్టే రాఖీ ద్వారా వారు తలపెట్టే కార్యములు విజయవంతమై, సుఖసంపదలు చేకూరుతాయని విశ్వాసం. 
 
ఇకపోతే.. శ్రావణ పూర్ణిమ రోజున బ్రాహ్మణులు నూతన యజ్ఞోపవీతధారణలు చేసి విద్యార్థులకు వేదపఠనం ప్రారంభిస్తారు. 'జంధ్యాల పూర్ణిమ' అని పిలువబడే ఈ పండుగ కాలక్రమమున "రక్షాబంధన్ మరియు రాఖీ" పండుగగా ప్రాచుర్యం పొందింది.