మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 20 డిశెంబరు 2015 (18:45 IST)

ముక్కోటి ఏకాదశినాడు జాగరణ చేస్తే ఫలితం ఏమిటి?

ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని వేయికనులతో వీక్షించి, శ్రీహరిని సేవించి తరించాలని మూడు కోట్లమంది దేవతలు వైకుంఠమునకు చేరుకునే రోజే వైకుంఠ ఏకాదశిగా పరిగణించబడుతోంది. ఈ వైకుంఠ ఏకాదశి శనివారంలో వస్తే మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. 
 
ముక్కోటి ఏకాదశి రోజున జాగరణ చేసి విష్ణు, వెంకన్న దేవాలయములకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని విష్ణు అష్టోత్తరమును పఠించడం మంచిది. అదే రోజున సత్యనారాయణ వ్రతమును ఆచరించి విష్ణుమూర్తిని నిష్ఠతో పూజించే వారికి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. 
 
ఆ రాత్రి నిద్రపోకుండా విష్ణు నిత్యపూజ, విష్ణు స్తోత్రమాల, విష్ణు సహస్రనామ స్తోత్రములతో పారాయణ చేయాలి. మరుసటి రోజు ఉదయం శుచిగా స్నానమాచరించి శ్రీహరిని పూజించి సన్నిహితులకు శుభాకాంక్షలు తెలయజేయడం శుభప్రదం. 
 
విష్ణు సహస్ర నామ సోత్రమ్, విష్ణు పురాణం, సత్యనారాయణ స్వామి వ్రతము వంటి పుస్తకాలను ఫల, పుష్ప, తాంబూలాలతో స్త్రీలకు దానం చేయడం మంచిది. అదేవిధంగా ఏకాదశిన దేవాలయాల్లో విష్ణుమూర్తికి లక్ష తులసి పూజ చేయించేవారికి సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి.