శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. ఫిఫా ప్రపంచ కప్ 2018
Written By pnr
Last Updated : ఆదివారం, 24 జూన్ 2018 (13:04 IST)

ఫిఫా 2018 : బెల్జియం గోల్స్ వర్షం... మట్టికరిచిన ట్యునిషియా

ర‌ష్యా వేదిక‌గా జ‌రుగుతున్న‌ సాకర్ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఫిఫా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న బెల్జియం(రెడ్ డెవిల్స్) అదరగొట్టింది. టోర్నీలో వరుసగా రెండో విజయం సాధించి నాకౌట్‌కు అర్హత సాధించింది.

ర‌ష్యా వేదిక‌గా జ‌రుగుతున్న‌ సాకర్ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఫిఫా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న బెల్జియం(రెడ్ డెవిల్స్) అదరగొట్టింది. టోర్నీలో వరుసగా రెండో విజయం సాధించి నాకౌట్‌కు అర్హత సాధించింది. ర్యాంకింగ్స్‌లో 21వ స్థానంలో ఉన్న ట్యునిషియాను మట్టికరిపించింది.
 
అలాగే, గ్రూప్-జీలో భాగంగా శనివారం జరిగిన పోరులో బెల్జియం 5-2తో ట్యునిషియాపై ఘన విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన ట్యునిషియాకు మరో ఓటమి తప్పలేదు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఘోర పరాభవాన్ని ఎదుర్కొని టోర్నీ నుంచి నిష్క్రమించింది.
 
ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో 5-2 విజయాన్ని సొంతం చేసుకోవడం ఫిపా ప్రపంచకప్‌ చరిత్రలో ఇది తొమ్మిదోసారి. ట్యూనిషియాపై ఏకంగా ఐదు గోల్స్‌ కొట్టిన బెల్జియం సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పడమే కాకుండా, గ్రూప్‌-జిలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
 
అదేసమయంలో బెల్జియం దూకుడుకు చిత్తుగా ఓడిన ట్యూనిషియా ప్రపంచకప్‌లలో వరుసగా 13వ మ్యాచ్‌లో విజయం లేకుండానే ముగించింది. బెల్జియం స్టార్స్‌ ఎడెన్‌ హజార్డ్‌, రుమెలు లుకాక్‌లు చెరో రెండు గోల్స్‌తో ట్యూనిషియాను ముంచెత్తారు.
 
ఆఖరు క్షణాల్లో సబ్‌స్టిట్యూట్‌ మిచీ బెతస్యూహయి మరో గోల్‌తో బెల్జియం గోల్స్‌ సంఖ్యను ఐదుకు పెంచాడు. పనామాతో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ నెగ్గితే.. గ్రూప్‌-జి నుంచి ఇంగ్లండ్, బెల్జియంలు నేరుగా నాకౌట్‌కు అర్హత సాధించనున్నాయి.