శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. ఫిఫా ప్రపంచ కప్ 2018
Written By pnr
Last Updated : గురువారం, 14 జూన్ 2018 (13:28 IST)

మదిదోచే మహా సంగ్రామం.. పిల్లి ఓటు రష్యాకే...

ప్రపంచాన్ని ఊపేసే సాకర్‌ మహా సంగ్రామం మళ్లీ వచ్చేసింది. క్రీడా జగత్తును ఆనందంలో, ఆశ్చర్యంలో ముంచెత్తే బంతాటలో అతి పెద్ద సమరం.. అతి పెద్ద దేశమైన రష్యాలో గురవారం మొదలైంది. అనేక అవాంతరాలను దాటొచ్చిన రష్య

ప్రపంచాన్ని ఊపేసే సాకర్‌ మహా సంగ్రామం మళ్లీ వచ్చేసింది. క్రీడా జగత్తును ఆనందంలో, ఆశ్చర్యంలో ముంచెత్తే బంతాటలో అతి పెద్ద సమరం.. అతి పెద్ద దేశమైన రష్యాలో గురవారం మొదలైంది. అనేక అవాంతరాలను దాటొచ్చిన రష్యా ఈ మెగా టోర్నీకి తొలిసారి ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రారంభ మ్యాచ్‌లో రష్యా, సౌదీ అరేబియా జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది.
 
అయితే, ఆతిథ్య జట్టుకే తన ఓటు అంటోంది రష్యాకు చెందిన చెవిటి పిల్లి అచిల్లె. రెండు దేశాల జాతీయ జెండాలను ముందుంచితే, రష్యా పతకాన్ని పిల్లి ఎంచుకుంది. ఇక.. జర్మనీలోని చెమ్‌నిట్జ్‌ పార్క్‌కు చెందిన ఓలోజ అనే పులి మాత్రం తొలి పోరు ఫలితాన్ని భిన్నంగా ఊహించింది. రెండు దేశాల జెండాల బాక్స్‌లను ముందుంచగా.. దేన్నీ ముట్టుకోకుండా తన ఫలితాన్ని పరోక్షంగా డ్రాగా నిర్ధారించింది.  
 
'మహా సంగ్రామం' గత చరిత్ర 
* ఇది 21 వరల్డ్‌కప్‌. మొదటి టోర్నీ 88 ఏళ్ల కిందట ఉరుగ్వే (1930)లో జరిగింది. ఆ జట్టే తొలి విజేతగా నిలిచింది.
* ఇప్పటిదాకా జరిగిన విశ్వ సమరాల్లో యూరోపియన్‌ (11), దక్షిణ అమెరికా (9) దేశాలే విజేతలుగా నిలిచాయి.
* ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్న చిన్న దేశం ఐస్‌‌లాండ్‌. ఆ దేశ జనాభా 3 లక్షల 34 వేలు మాత్రమే.
* వరల్డ్‌కప్‌ ట్రోఫీ ఏడు రోజుల పాటు కనిపించకుండా పోయింది. 1996 వరల్డ్‌కప్‌ ప్రారంభమవడానికి ముందు దాన్ని దొంగిలించారు.
* బ్రెజిల్‌ అత్యధికంగా ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచింది.
* మెక్సికో ఈ టోర్నీకి అర్హత సాధించడం ఇది 16వసారి. ఒక్కసారి కూడా కప్పు నెగ్గకుండా అత్యధిక సార్లు పోటీ పడ్డ జట్టు అదే.
* వరల్డ్‌క్‌పలో ఆల్‌టైమ్‌ టాప్‌ స్కోరర్‌ మిరోస్లావ్‌ క్లోజ్‌. జర్మనీకి చెందిన ఈ స్ట్రయికర్‌ నాలుగు టోర్నీల్లో కలిపి 16 గోల్స్‌ కొట్టాడు.
* ఒక వరల్డ్‌క్‌పలో నమోదైన అత్యధిక గోల్స్‌ 171. ఇవి 1988, 2014 టోర్నీలలో నమోదయ్యాయి. 2010లో అతి తక్కువగా 145 గోల్స్‌ నమోదయ్యాయి.