శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2017 (11:41 IST)

డేటింగ్ ప్రియులపై జీఎస్టీ భారమెంత? కండోమ్‌లు, గర్భ నిరోధక మాత్రలపై పన్ను నిల్

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం జూలై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఒకే దేశం.. ఒకే పన్ను విధానంలో భాగంగా ఈ కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ జీఎస్టీ విధానం అమల్లోకి

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం జూలై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఒకే దేశం.. ఒకే పన్ను విధానంలో భాగంగా ఈ కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలపై ఎంతోకొంత.. ఏదో ఒక రూపంలో ప్రభావం చూపుతుందట. పైగా, స్వతంత్ర భారతావనిలో అతిపెద్ద పన్ను సంస్కరణగా భావిస్తున్నారు. ఈ జీఎస్టీ ప్రభావం కేవలం వస్తు, సేవలపైనే కాకుండా డేటింగ్ ప్రియులపైనా కూడా ప్రభావం చూపుతుందట. 
 
డిన్నర్ డేట్: ప్రేయసి లేదా ప్రియుడితో కలసి డిన్నర్‌కు వెళ్లడం సహజం. ఫైవ్‌స్టార్ రెస్టారెంట్లు, లగ్జరీ హోటళ్లు, ఏసీ రెస్టారెంట్లకు డిన్నర్‌కు వెళితే మాత్రం బిల్లు తగ్గుతుంది. ప్రస్తుతమున్న 28 శాతం పన్ను 18 శాతానికి తగ్గుతుంది కాబట్టి, ఆ మేరకు బిల్లు భారం తగ్గుతుంది. అదే నాన్ ఏసీ రెస్టారెంట్ అయితే, బిల్లు భారం పెరుగుతుంది.
 
బహుమతులు ఇవ్వాలంటే జేబుకు చిల్లే : ప్రేమికులు తమతమ పుట్టినరోజులు, ప్రేమికుల దినోత్సవాలకు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. అందువల్ల జీఎస్టీ విధానంతో బహుమతులు కొనడం వల్ల జేబుకు చిల్లుపడినట్టే. ఎంచుకునే బహుమతిని బట్టి గరిష్టంగా 28 శాతం వరకూ పన్ను చెల్లించాల్సి వుంటుంది. 
 
మూవీ డేట్: సినిమాకు వెళ్లే డేటింగ్ ప్రియులు మల్టీ ప్లెక్సులకు వెళితే మాత్రం అదనపు రుసుం చెల్లించాల్సి వుంటుంది. చిన్న థియేటర్లకు వెళితే కాస్తంత లాభపడొచ్చు. మల్టీ ప్లెక్సుల్లో 18 నుంచి 28 శాతానికి పెరిగిన జీఎస్టీ, రూ.100 కన్నా తక్కువ టికెట్ ధరలుండే థియేటర్‌లో 18 శాతంగా ఉంటుంది.
 
బెడ్ రూం డేట్: ఓ రాత్రి సరదాగా హోటల్‌లో గడపాలనుకుంటే డేట్ ప్రియులకు జీఎస్టీ అన్ని రకాలుగా అనుకూలమైనదే. కండోమ్‌ల నుంచి గర్భ నిరోధక మాత్రల వరకూ కొత్తవిధానంలో ఎంత మాత్రమూ పన్నులుండవు. ఇక హోటళ్ల బిల్స్ సైతం తగ్గి వస్తాయి కాబట్టి బెడ్ రూం డేట్ ఖర్చు తగ్గుతుంది.
 
విహార యాత్రకు వెళితే: నాలుగు రోజులు సరదాగా ఏదైనా రొమాంటిక్‌గా ఉండే ప్లేస్‌కు వెళ్లి రావాలనుకునేవారు విమానమో, ఏసీ రైలులో ప్రయాణిస్తేనే మేలు. విమానంలో ఎకానమీ క్లాస్ తీసుకుంటే కొంచెం ఖర్చు తగ్గుతుంది. అదే బిజినెస్ క్లాస్‌ను ఎంచుకుంటే ధర పెరుగుతుంది. 
 
క్యాబ్ ఎక్కితే : సరదాగా ఊరు చుట్టాలని భావించి క్యాబ్ బుక్ చేసుకుంటే జీఎస్టీ అమలుతో స్వల్పంగా లాభం చేకూరుతుంది. ప్రస్తుతం ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ సంస్థలపై 6 శాతంగా ఉన్న పన్ను 5 శాతానికి తగ్గనుంది.