శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జనరల్ నాలెడ్జ్
Written By PNR
Last Updated : బుధవారం, 29 అక్టోబరు 2014 (17:48 IST)

ఏడాదికి 5 శాతమే వర్షపాతం.. కానీ 70 శాతం నీరు నిల్వవుండే ఖండమేది?

భూగోళంపై మూడొంతుల నీరు.. ఒక వంతు భూమి ఉంటుందన్నది మనకు తెలుసు. కానీ, భూగోళం మొత్తంమీద ఉండే నీటిలో 70 శాతం నిల్వవుండే ఖండమేదో చాలా మందికి తెలియదు. ఈ ఖండంలో నీరు అన్ని కాలాల్లో గడ్డకట్టే ఉంటుంది. పైగా.. ఒక యేడాదిలో కేవలం 5 శాతం మాత్రమే వర్షపాతం నమోదవుతుంది. ఇక్కడ చినుకు పడిన వెంటనే అది గడ్డకట్టి పోతుంది. అందుకే ఇక్కడ నీటి నిల్వలు పుష్కలంగా ఉంటుంది. ఆ ప్రాంతమే అంటార్కిటికా ఖండం. ఇది భూగోళానికి దక్షిణ ధృవాన్ని ఆవరించి వుంది. 
 
ఈ ఖండం అంతటా మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ పడే వర్షపాతం సహారా ఎడారి కంటే తక్కువ. మన భూగోళంపై ఉండే అతి చల్లటి ప్రదేశాల్లో ఇది మొదటి వరుసలో ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 89 (-89) డిగ్రీల సెల్సియస్. 
 
సాధారణంగా నీరు మంచుగా మారే ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెల్సియస్. దీని కంటే 89 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత ఈ ఖండంపై నమోదవుతుంది. దీంతో ఈ ఖండం అంతటా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ కారణంగానే ఈ ఖండాన్ని గడ్డగట్టిన ఎడారి అని కూడా పిలుస్తారు.