శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జనరల్ నాలెడ్జ్
Written By chj
Last Updated : సోమవారం, 30 జనవరి 2017 (21:11 IST)

వీళ్ళ పూర్తి పేర్లు మీకు తెలుసా? అయితే తెలుసుకోండి...

ఎన్టీఆర్ అన‌గానే నంద‌మూరి తార‌క రామారావు అని ట‌క్కున చెప్పేస్తాం. ఎఎన్ఆర్... అంటే అక్కినేని నాగేశ్వ‌ర‌రావు అని చెప్పేయ‌చ్చు. కానీ, ఇలా కొంద‌రు ప్ర‌ముఖుల పేర్లు పూర్తిగా తెలియ‌నివాళ్ళు చాలామంది ఉన్నారు

ఎన్టీఆర్ అన‌గానే నంద‌మూరి తార‌క రామారావు అని ట‌క్కున చెప్పేస్తాం. ఎఎన్ఆర్... అంటే అక్కినేని నాగేశ్వ‌ర‌రావు అని చెప్పేయ‌చ్చు. కానీ, ఇలా కొంద‌రు ప్ర‌ముఖుల పేర్లు పూర్తిగా తెలియ‌నివాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో కొంద‌రు నిక్ నేమ్ ఫ్యామ‌స్ అయిపోయి... అస‌లు పేరు తెలియ‌ని ప‌రిస్థితి. బాపు బొమ్మ అంద‌రికీ తెలుసు. కానీ బాపూ అస‌లు పేరు ఎంద‌రికి తెలుసు? ఇక్క‌డ ఓ 50 మంది తెలుగు ప్రముఖుల అసలు పేర్లు ఇస్తున్నాం... మీకోసం.
 
1.బాపు: సత్తిరాజు లక్ష్మీనారాయణ
2.ఆచార్య ఆత్రేయ: కిళాంబి నరసింహాచార్యులు
3.ఆరుద్ర: భాగవతుల సదాశివశంకరశాస్త్రి
4.శ్రీశ్రీ: శ్రీరంగం శ్రీనివాసరావు
5.జాలాది: జాలాది రాజారావు
6.సాహితి: చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి
7.వనమాలి: మణిగోపాల్
8.వెన్నెలకంటి: వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్
9.పినిసెట్టి: పినిసెట్టి శ్రీరామమూర్తి
10.సిరివెన్నెల: చేంబోలు సీతారామ శాస్త్రి 
11.జొన్నవిత్తుల: జొన్నవిత్తుల రామలింగేశ్వరశాస్త్రి
12.దాశరథి: దాశరథి కృష్ణమాచార్యులు
13.అంజలి: అంజమ్మ
14.రేలంగి: రేలంగి వేంకటరామయ్య
15.ఘంటసాల: ఘంటసాల వేంకటేశ్వరరావు
16.రాజనాల: రాజనాల కాళేశ్వరరావు
17.K.R.విజయ: దైవనాయకి
18.దేవిక: ప్రమీల
19.భానుప్రియ: మంగభామ
20.జయప్రద: లలితారాణి
21.రాజబాబు: పుణ్యమూర్తుల అప్పలరాజు
22.జంధ్యాల: జంధ్యాల వీరవేంకటశివసుబ్రహ్మణ్యశాస్త్రి
23.ఏ.వి.ఎస్: A.V. సుబ్రహ్మణ్యం
24.పెండ్యాల: పెండ్యాల నాగేశ్వరరావు
25.ముక్కామల: ముక్కామల రాధాకృష్ణమూర్తి
26.చిరంజీవి: కొణిదల వరప్రసాద్
27.కృష్ణభగవాన్: పాపారావుచౌదరి
28.చక్రవర్తి(సంగీత దర్శకుడు): అప్పారావు
29.రామదాసు: కంచర్ల గోపన్న
30.బీనాదేవి: బి.నాగేశ్వరీదేవి
31.మో: వేగుంట మోహనప్రసాద్
32.చే.రా: చేకూరి రామారావు
33.శారద: నటరాజన్
34.బుచ్చిబాబు: శివరాజు వేంకటసుబ్బారావు
35.ఎన్.ఆర్.నంది: నంది నూకరాజు
36.సినారె: సింగిరెడ్డి నారాయణరెడ్డి
37.నగ్నముని: హృషీకేశవరావు
38.తిరుపతి వేంకటకవులు: దివాకర్ల తిరుపతిశాస్త్రి,చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి
39.కొవ్వలి: కొవ్వలి లక్ష్మీ నరసింహారావు
40.కా.రా: కాళీపట్నం రామారావు
41.వోల్గా: పోపూరి లలితాకుమారి
42.ఉషశ్రీ: పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు
43.కరుణశ్రీ: జంధ్యాల పాపయ్య శాస్త్రి
44.గద్దర్: బి.విఠల్ రావు
45.గోరా: గోపరాజు రామచంద్రరావు
46.చా.సో: చాగంటి సోమయాజులు
47.జరుక్ శాస్త్రి: జలసూత్రం v రుక్మిణీనాథశాస్త్రి
48.విద్వాన్ విశ్వం: విశ్వరూపశాస్త్రి
49.రావిశాస్త్రి: రాచకొండ విశ్వనాథ శాస్త్రి