మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జనరల్ నాలెడ్జ్
Written By JSK
Last Modified: మంగళవారం, 30 ఆగస్టు 2016 (15:59 IST)

కృష్ణా, గుంటూరు జిల్లాల‌కు అంత పేరెందుకో....

విజ‌య‌వాడ‌ : కృష్ణా, గుంటూరు జిల్లాల మాట వినగానే ఏం చెప్పకముందే అబ్బో… అనే సౌండ్ వస్తుంది. అలా ఎందుకొస్తుందో తెలియాలంటే, ముందు ఆ జిల్లాల స్పెషాలిటీ ఏంటో తెలుసుకోవాలి. * దేశం మొత్తంమ్మీద కృష్ణా జిల్లానే టాప్. ఇండియా జీడీపీ 7.5 శాతం. ఏపీ జీడీపీ 11.99

విజ‌య‌వాడ‌ :  కృష్ణా, గుంటూరు జిల్లాల మాట వినగానే ఏం చెప్పకముందే అబ్బో… అనే సౌండ్ వస్తుంది. అలా ఎందుకొస్తుందో తెలియాలంటే, ముందు ఆ జిల్లాల స్పెషాలిటీ ఏంటో తెలుసుకోవాలి.
* దేశం మొత్తంమ్మీద కృష్ణా జిల్లానే టాప్. ఇండియా జీడీపీ 7.5 శాతం. ఏపీ జీడీపీ 11.99 శాతం. కృష్ణా జిల్లా జీడీపీ 12.89 శాతం. తలసరి ఆదాయంలో కృష్ణా జిల్లాది రాష్ట్రంలో ద్వితీయస్థానం. 1,40,593 రూపాయలు. గుంటూరుదైతే 1.04 లక్షలు.
* దేశానికి వచ్చే విదేశీ మారక ద్రవ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల వాటా 7.6 శాతం. దేశంలోనే ఈ రెండు జిల్లాలదే టాప్ పొజిషన్.
* కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 2,960 మంది బిలీనియర్లు ఉన్నారు. ఈ జిల్లాల నుంచి వెళ్లిన వాళ్లలో 460 మంది అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో టైకూన్‌లుగా ఉన్నవాళ్లే.
 
* పొగాకు, పసుపు, మిర్చిలో ఆసియా దేశాలకి ఎగుమతి చేసే మోస్ట్ వాంటెడ్ సెంటర్ గుంటూరే. ఇక్కడి నుంచి వచ్చే ఉత్పత్తుల్ని మయన్మార్, సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్ ప్రత్యేకంగా తీసుకొంటాయ్.
* వాహనాల వాడకంలోనూ కృష్ణా, గుంటూరులే టాప్. టూవీలర్, ఫోర్ వీలర్ అన్నీ కలిపి ఈ రెండు జిల్లాల్లో 196 షోరూమ్‌లు ఉన్నాయ్. ఇందులో 44 కార్ల కంపెనీ షోరూమ్‌లే ! రూరల్ జిల్లాల్లో ఇంత మార్కెట్ ఉన్న ఒకే ఒక్క ఏరియా ఇదే. దేశంలోనే ఇది రికార్డ్.
25 లక్షల వాహనాలున్నాయ్ కాబట్టి ఏపీలో ఎక్కువగా ఫ్యూయెల్ వాడుతున్నది కూడా ఈ రెండు జిల్లాలే.
 
* కేరళ తర్వాత దేశంలో ఎక్కువమంది ఎన్నారైలు ఉన్న ప్రాంతం కృష్ణా, గుంటూరు జిల్లాలే. 29,500 మంది ప్రవాసులున్నారు రెండు జిల్లాల్లో. జిల్లాల వారీగా తీస్తే… ఇది దేశంలోనే టాప్.
* దేశం మొత్తంమ్మీద వైద్యులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు కృష్ణా, గుంటూరు. ఈ రెండు జిల్లాల్లో 12,600 మంది డాక్టర్లున్నారు. ఇంతమంది మరెక్కడా లేరు.
* ఇంటర్నెట్ వినియోగంలో ఏపీలో క్రిష్ణా గుంటూరు జిల్లాలే టాప్. మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల్లో 36 శాతం ఈ రెండు జిల్లాల్లోనే ఉన్నారు.
* గుంటూరు జిల్లాలో 29 గ్రామాల రైతులు… 33 వేల ఎకరాలు స్వచ్చందంగా రాజధానికి కోసం ఇచ్చారు. అందులో 8 వేల ఎకరాలు రైతు కుటుంబాలకి ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయిస్తోంది. తిరిగి ఇస్తోంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద భూ సమీకరణ.
 
*కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 28 జల విద్యుత్కేంద్రాలున్నాయ్. ఏపీ మిగులు విద్యుత్ రాష్ట్రం కావడంలో వీటి పాత్ర చాలా కీలకం . కృష్ణా గుంటూరు జిల్లాల్లో సరిగ్గా 28 సిమెంట్ కంపెనీలు కూడా ఉన్నాయ్. నిర్మాణానికి ఇవే మూలస్తంభాలు
* 1954 నుంచి 140 మంది తెలుగువాళ్లకి పద్మశ్రీలు వస్తే… అందులో 45 మంది క్రిష్ణా గుంటూరు జిల్లాల వాళ్లే. 18 పద్మవిభూషణ్‌లు వస్తే అందులో ఐదుగురు కృష్ణా జిల్లాల వాళ్లే !
* కృష్ణా గుంటూరు జిల్లాలు చదవుల్లోనూ టాప్. గుంటూరులో 51 ఇంజినీరింగ్ కాలేజీలుంటే… క్రిష్ణాలో 39 ఉన్నాయ్. 690 ఇంటర్మీడియట్ కాలేజీలు, ఐదు వర్సీటీలూ ఈ జిల్లాల్లో ఉన్నాయ్
* ఇక కృష్ణా గుంటూరు జిల్లాల నదీతీరాల్లో 438 గుళ్లూ గోపురాలున్నాయ్. తమిళనాడులో కూడా ఇంత డెన్సిటీతో ఆలయాలు లేవు...
ఇప్పుడు అర్థమయిందా?.. ఈ రెండు జిల్లాల‌కు అంత పేరెందుకో.