శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (14:27 IST)

కోపం.. ఆరోగ్యానికి కూడా శత్రువే!

తన కోపమే తనకు శత్రువంటారు పెద్దలు.. అలాంటి కోపం ఆరోగ్యానికి కూడా శత్రువే అంటున్నారు.. వైద్య నిపుణులు. కోపాన్ని ఎంతమటుకు తగ్గిస్తే అంత మంచిదని వారు సూచిస్తున్నారు. కోపంతో ఆరోగ్యానికి కీడు తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. కోపంతో మానసిక ఒత్తిడి, గుండెపోటు, రక్తపోటు, తలనొప్పి, నిద్రలేమి సమస్యలు తప్పవు. 
 
కోపం మరింత ఎక్కువైతే.. మానసిక ఒత్తిడి తప్పదు. తద్వారా రక్తపోటు, మధుమేహం తప్పదు. కోపం ద్వారా గుండె పనితీరు మరింత వేగవంతమవుతుంది. గుండె పల్స్ పనితీరు కోపంతో పెరిగిందంటే ఆరోగ్యానికే చేటు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడైతే కోపం వస్తుందో అప్పుడు శరీరంలోని హార్మోన్లు చురుగ్గా వుంటాయి. తద్వారా సక్రమమైన నిద్ర వుండదు.  నిద్రలేమి కారణంగా శరీరానికి లభించాల్సిన విశ్రాంతి ఉండదు.
 
ఫలితంగా సులభంగా అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఇకపోతే..  కోపంతో అధిక రక్తపోటు, శ్వాస సంబంధిత వ్యాధులు, తలనొప్పి, గుండెపోటు, మెదడు వాపు ఏర్పడే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.