శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2015 (16:47 IST)

యాంటీబయోటిక్స్‌తో జాగ్రత్త.. మధ్యలోనే ఆపేయకండి!

యాంటీబయోటిక్స్‌ కనుక్కోవటంతో మనిషి ఆరోగ్యం మెరుగైంది. అయితే యాంటీబయోటిక్స్ విషయంలో జాగ్రత్త అవసరం. అన్నీ అందరికీ పడవు. కొన్ని కొంతమంది వాడకూడదు. వైద్యుల సలహా మేరకే యాంటీ బయోటిక్స్ వాడాలి. ఒకవేల వైద్యుల సలహాతో వేసుకుంటున్నప్పటికీ ఆ యాంటి బయోటిక్స్ ఏవి, ఎంత డోస్‌లో వేసుకుంటున్నది ఒకచోట నమోదు చేసి ఉంచండి. భవిష్యత్తులో చికిత్స సమయంలో ఈ వివరాలు వైద్యులకు చెప్పాల్సి వస్తుంది. 
 
 మూత్రపిండం, కాలేయం బలహీనంగా ఉంటే ఆ విషయం వైద్యునికి చెప్పండి. దానిని బట్టి యాంటిబయోటిక్స్ వాడకం మారుస్తారు. వైద్యులు ఏదైనా యాంటీబయోటిక్ ఇచ్చినప్పుడు దానిని ఆయన చెప్పినరీతిలో కోర్స్ పూర్తయ్యేవరకు వాడండి. మధ్యలో ఆపి మీ నిరోధక వ్యవస్థను మీరే బలహీనపరుచుకోవద్దు. 
 
గర్భిణీస్త్రీలు యాంటీబయోటిక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతర రకాల మందులు వాడుతున్నప్పుడు యాంటీ బయోటిక్స్ తగిన ఫలితం ఇవ్వవు. మీరు వాడుతున్న ఇతర మందుల గురించి ముందుగానే వైద్యుడికి తెలియచెప్పండి. మత్తుపానీయాలు తీసుకున్నా యాంటీ బయోటిక్స్ ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఆ అలవాటును తప్పక మానేయాలి.