మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 19 జూన్ 2015 (16:16 IST)

ఆపిల్ ముక్కల మసాజ్‌తో ఆయిలీ స్కిన్‌కు చెక్

ఆపిల్ ముక్కల మసాజ్‌తో ఆయిలీ స్కిన్‌ను దూరం చేసుకోవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు. ఆపిల్ ముక్కలను చాలా పల్చగా సన్నని ముక్కలుగా కట్ చేసిని.. ఆ ముక్కలతో ముఖం మొత్తం మర్దన చేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఆయిలీ స్కిన్‌ నియంత్రించినట్లవుతుంది. 
 
అలాగే తేనె, అల్లంను పేస్ట్‌లా తయారుచేసి ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు దంతక్షయానికి ముందే అప్లై చేయాలి. ఇది ముఖంలో చాలా వరక ముడతలను నిరోధిస్తుంది. ఇక ఆలివ్ ఆయిల్‌తో చర్మానికి మసాజ్ చేయడం వల్ల చర్మంలో రక్తప్రసరణ బాగా పెంపొదిస్తుంది. చర్మాన్ని బిగువుగా చేస్తుంది. కాబట్టి ఆలివ్ ఆయిల్‌ను ప్రతి రోజూ ముఖానికి మసాజ్ చేయండని బ్యూటీషన్లు సలహా ఇస్తున్నారు. 
 
తాజా పసుపు కొమ్ములను గ్రైండ్ చేసి, పౌడర్ చేసి దానికి కొద్దిగా నిమ్మరసం చేర్చి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల సన్ టాన్‌ను తొలగిస్తుంది. చర్మాన్ని సున్నితంగా, మృదువుగా ఉంచుతుంది.