గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (14:45 IST)

కంటి చూపును మెరుగుపరిచే బాదం..!

కంటి చూపును మెరుగుపరుచుకోవాలంటే.. బాదం పప్పులను తీసుకోవాలంటున్నారు న్యూట్రీషన్లు. కంటి చూపును మెరుగుపరచడంలో బాదం గ్రేట్‌గా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటిమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. 
 
ఇది జ్ఝాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది. రాత్రి సమయంలో 5నుండి 10 బాదంలను నీటిలో నానబెట్టి, ఉదయం పేస్ట్ చేసి గోరువెచ్చని పాలలో మిక్స్ చేసి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే కంటి  చూపును మెరుగుపరుచుకోవచ్చు. 
 
అలాగే డ్రై ఫూట్స్, నట్స్ కూడా తీసుకోవచ్చు. వీటిలో విటమిన్ ఇ పుష్కలంగా ఉండే నట్స్ తీసుకోవడం ద్వారా వీటిల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. 
 
ఇవి వాపు(inflammation)ను తగ్గించి కంటి ఆరోగ్యాన్ని, కార్డియో వాస్కులర్ ఆరోగ్యాన్నీ కాపాడుతాయి. బెర్రీస్‌లో ఉన్న ఫ్లెవనాయిడ్స్, నేచురల్ యాంటీయాక్సిండెస్ కళ్ళును సురక్షితంగా ఉంచేందుకు ఉపయోగపడుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.