శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2015 (17:24 IST)

వేసవిలో చర్మానికి మేలు చేసే ఆహార పదార్థాలు ఏవి?

శరీరంలో మిగతా భాగాల మాదిరే మంచి ఆహారం వల్ల చర్మానికి ప్రయోజనం కలుగుతుంది. మంచి ఆహారం రోజుకు 12 నుంచి 14 గ్లాసుల నీటిని తాగడం వల్ల చర్మానికి యవ్వన రూపం దక్కుతుంది. రక్తంలో వుండే టాక్సిన్ల వల్ల చర్మం పేలవంగా తయారవుతుంది. 
 
అందుచేత వేసవిలో పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. పోషకాహారం విషతుల్యాన్ని స్వంతం చేస్తుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో గిన్నెడు పప్పు దినుసులు, పాలు, భోజనానికి రెండు గంటల ముందు జ్యూసిగా ఉండే పండ్లు, గుప్పెడు నట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. మధ్యాహ్న భోజనంలో ఇష్టం వచ్చిన కూరగాయల వేపుడు తినాలి. 
 
బ్రెడ్, అన్నం, పాస్తా, రోటీలను తీసుకోవచ్చు. సాయంత్రం వేళ ఓ గిన్నెడు పండ్ల ముక్కలు, ఫ్యాట్ తక్కువగా గల పెరుగు తినాలి. లేదా వెజిటబుల్ సలాడ్ తీసుకోవచ్చు. రాత్రి భోజనంలో చేపలు లేదా పప్పులు కలిపిన పనీర్, రోటి, తేలిగ్గా అన్నం, ఆకుకూరలు ఎక్కువగా గల సలాడ్ తినాలి. ఈ విధమైన ఆహారం చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. వ్యాయామాలు, ధ్యానం, మసాజ్‌లు చర్మానికి నిగారింపు ఇస్తాయి.