శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (16:24 IST)

రోజంతా చురుగ్గా ఉండాలంటే.. పెరుగులో పండ్ల ముక్కలు..?!

రోజంతా చురుగ్గా ఉండాలంటే ఎనర్జీ అవసరం. శరీరానికి కావలసిన ఎనర్జీ లభించేందుకు కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటంటే.. ఉదయం నిద్ర లేచాక.. పరగడుపున రెండు గ్లాసుల నీరు తీసుకోవాలి. 30 నిమిషాల పాటు వ్యాయామం తప్పనిసరి. బ్రేక్ ఫాస్ట్‌లో పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఓట్స్, రాగి, మొలకెత్తిన ధాన్యాలు, శెనగలు, ఇడ్లీ, దోసె వంటివి తీసుకోవాలి. పూరీల్లాంటి నూనెలో వేపిన వాటిని తీసుకోకూడదు. 
 
ఉదయం పది గంటలకు పైగా ఒక కప్పు పెరుగులో కట్ చేసిన పండ్లను తీసుకుని ఐస్ క్రీమ్‌లా తీసుకోవచ్చు. లేదా మిల్క్ షేక్ తీసుకోవచ్చు. పెరుగులో శరీరానికి కావలసిన గుడ్ బ్యాక్టీరియా, శరీరానికి కావలసిన క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. మధ్యాహ్న భోజనం రెండు గంటల్లోపు తీసుకోవాలి. అన్నం, వేపుళ్లు, పప్పు ఉండేలా చూసుకోవాలి. నాన్ వెజ్ తీసుకునేవాళ్లు ఉడికించిన మటన్, చికెన్ ముక్కలు తీసుకోవచ్చు. సాయంత్రం 4 గంటల ప్రాంచంలో పాప్ కార్న్, ఉడికించిన శెనగలు, స్వీట్ కార్న్ సూపర్, పండ్ల రసాలు తీసుకోవచ్చు. కాఫీ, టీ అలవాటుండే వారు రోజుకి మూడుసార్లు మాత్రమే తీసుకోవాలి.
 
ఇక రాత్రి విషయానికి వస్తే.. గోధుమ దోసె, పెసరట్టు, ఇడ్లీ, చపాతీలు తీసుకోవాలి. రాత్రిపూట పరోటా, చికెన్ వంటివి తీసుకోకూడదు. కూల్ డ్రింక్స్, ఫాస్ట్ పుడ్స్ వంటివి తీసుకోకూడదు. రెండు గంటలకు ఒకసారి నీళ్లు తీసుకోవాలి. 8 గంటల పాటు నిద్రపోవాలి. టైమ్‌కి ఆహారం తీసుకోవాలి. ఎప్పుడు పడితే ఆహారం తీసుకోకూడదు. నిజం చెప్పాలంటే సమయానికి తీసుకునే ఆహారం, 8 గంటల పాటు నిద్ర, వ్యాయామం ఈ మూడే రోజంతా మిమ్మల్ని చురుగ్గా ఉంచుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు.