శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (16:53 IST)

పచ్చికూరగాయలను ఎలా తింటే బరువు తగ్గుతారు!

పచ్చికూరగాయలను తింటే ఆరోగ్యానికి మంచిదని ఈ మధ్య చాలామంది తినడం ప్రారంభిస్తున్నారు. కాకపోతే ఎప్పుడు తినాలో సరైన సమయం తెలియక ఎప్పుడుపడితే అప్పుడు, వేటితో పడితే వాటితో కలిపి తింటున్నారు. కొందరు బరువు తగ్గాలని  అన్నంలో ఈ పచ్చికూరలను తింటారు. ఇంకొందరు పండ్లు, పచ్చికూరలు తింటూ ఉంటారు. ఇవన్నీ ఆ కూరలు తిన్న లాభాన్ని పూర్తిగా రానివ్వవు.
 
పచ్చికూరల జీర్ణక్రియ వేరుగా ఉంటుంది. ఉదయం పూట పచ్చి కూరలను నమిలి తినేకంటే వాటిని రసం తీసుకుని తాగడం తేలిక. టిఫిన్ కింద మొలకలను బాగా నమిలి తినాలి. పొట్ల, బీర, సొర, క్యారెట్, నాటు టమోటా, దోసకాయలు, బూడిద గుమ్మడి తినడానికి గానీ రసానికి గానీ వాడవచ్చు.
 
షుగర్ వ్యాధి ఉన్నవారు క్యారెట్, బీట్ రూట్, తేనె మూడింటిని కొద్దిగా రసంలా తీసుకోవచ్చు. అలాగే కూరగాయల ముక్కల్ని తురుమి ఆ తురుముకు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మరసం కలిపితే పచ్చికూర అవుతుంది. ఆ కూరను అన్నంకు బదులుగా గోధుమ రొట్టెలు 3 లేదా 4 కాల్చుకుని సాయంకాలం భోజనంలో ఈ కూరతో తినండి. దీనివలన బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.