బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 13 సెప్టెంబరు 2014 (18:10 IST)

బ్లూబెర్రీ ఫ్రూట్స్‌ తినండి.. ఇమ్యూనిటిని పెంచుకోండి!

బ్లూబెర్రీ ఫ్రూట్స్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా? రోజూ రెండేసి బ్లూ బెర్రీ పండ్లను తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధకతను పెంచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కూరగాయలకంటే పుష్కలంగా యాంటీ-ఆక్సిడెంట్స్ కలిగివుండే బ్లూ బెర్రీస్‌లను తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. 
 
అంతేగాకుండా ఇందులో ఫైబర్, విటమిన్ సి దాగివుండటంతో హృద్రోగ సంబంధిత రోగాలను దూరం చేసుకోవచ్చు. అలాగే పొట్ట కొవ్వును తగ్గించడంలో బ్లూబెర్రీస్ దివ్యౌషధంగా పనిచేస్తాయి. బరువును నియంత్రించడం, శరీరాన్ని స్లిమ్‌గా ఉంచడానికి బ్లూబెర్రీస్‌ను తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ముఖ్యంగా పొట్టను తగ్గించేందుకు కొంతమంది ఏవేవో చేస్తుంటారు. పొట్టను తగ్గించాలంటే.. ఎండు బ్లూబెర్రీలను తీసుకుంటే బెల్లీని తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఈ పండ్లలోని డ్రైక్లీన్సరైడ్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి.. స్లిమ్‌గా ఉంచుతుంది. అంతేగాకుండా, బ్లూ బెర్రీస్ హైబీపీతో పాటు మెదడు సంబంధిత వ్యాధులను సైతం దరిచేరనివ్వదని, జ్ఞాపకశక్తిని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.