గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 27 ఆగస్టు 2014 (17:15 IST)

బ్రిస్క్ వాక్‌తో ప్రయోజనాలేంటో తెలుసా?

ఆరోగ్యంగా ఉండాలంటే బిస్క్ వాక్ తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బ్రిస్క్ వాక్(స్పీడ్‌గా నడవడం)వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలున్నాయి. బ్రిస్క్ వాక్ వల్ల త్వరగా బరువు తగ్గుతారు. 
 
బ్రిస్క్ వాక్‌ బాడీ ఫ్యాట్ కరిగించి, ఎముకలకు తగినంత బలాన్ని చేకూర్చుతుంది. హైకొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించడంలో, శరీర ఛాయను కాంతివంతంగా మార్చడంలో బ్రిస్క్ వాక్ అద్భుతంగా సహాయపడుతుంది. 
 
రెగ్యులర్‌గా ప్రతి రోజూ అరగంట బ్రిస్క్ వాక్ చేయడం ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతుంది. దాంతో బ్రిస్క్ వాక్ వల్ల ఒక గొప్ప ప్రయోజనం గుండె సంబంధిత సమస్యలు రాకుండా నివారించుకోవచ్చు.
 
కొలెస్ట్రాల్ లెవల్స్‌ను కంట్రోల్లో ఉంచుకోవడానికి బ్రిస్క్ వాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. భోజనం చేసిన తర్వాత బ్రిస్క్ వాక్ చేయడం ద్వారా బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ పెద్దవారిలో కంట్రోల్ అవుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. 
 
క్యాన్సర్ కణాలను దరిచేరనీయకుండా చేస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. సెక్స్ లైఫ్‌ను మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.