శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2015 (15:29 IST)

వేసవికాలంలో మజ్జిగను మరవకండి!

వేసవికాలంలో మజ్జిగను మరవకండి! అంటున్నారు వైద్యులు. రోజులో తగినంత ఎక్కువ సార్లు మజ్జిగ తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ. మజ్జిగను ఎక్కువగా తీసుకోవడం ద్వారా వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఇది శరీరంలో బ్యాక్టీరియాను నాశనం చేసి, సాధారణ జలుబు మరియు దగ్గును నివారిస్తుంది.
 
అలాగే వేసవిలో జామకాయను తీసుకోవాలి. జామకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. జామకాయలో మరికొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. వీటిని వేసవికాలంలో తీసుకోవడం వల్ల హెల్దీ, ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది. జామకాయలో ఉండే ప్రోటీనులు ఎక్కువ శక్తిని అందిస్తాయి. కొబ్బరిబోండాంలోని నీరును వేసవిలో తీసుకోవడం ద్వారా శరీరానికి చల్లదనం లభిస్తుంది. ఇది శరీరంలోని టాక్సిన్స్ నివారిస్తుంది.
 
అలాగే వేసవికాలంలో ఆరెంజ్ పండ్లు తినడం చాలా అవసరం. ఎందుకంటే శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి వీటిలో పుష్కలంగా దొరుకుతుంది . ఆరెంజ్‌లో కూడా అధిక మొత్తంలో ప్రోటీన్స్ కలిగి ఉండి, మన శరీరానికి అవసరం అయ్యే ఎనర్జీని అందిస్తుంది. రోజంతా యాక్టివ్ గా ఉండేందుకు సహాయపడుతుంది.
 
ఇకపోతే.. వేసవిలో తినాల్సిన మరో ఫ్రూట్ టమోటో. ఎందుకంటే టమోటోల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని క్రిములను నాశనం చేస్తుంది. కాబట్టి, టమోటోలను మీ రెగ్యులర్ డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు.