గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 19 మే 2015 (14:46 IST)

భోజనం చేసిన తర్వాత నిమ్మరసం తాగితే బరువు తగ్గుతారా..?

భోజనం చేసిన తర్వాత నిమ్మరసం తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇందులోని సిట్రస్ ఆమ్లం బరువు పెరగనీయకుండా అడ్డుకుంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే కోడిగుడ్డును బ్రేక్ ఫాస్ట్ ద్వారా తీసుకుంటే ఫాట్ బర్న్ అవుతుందని తద్వారా శరీర బరువు తగ్గుతుంది. కోడి గ్రుడ్లు జింక్, విటమిన్ B, అయోడిన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, మరియు ప్రోటీన్ కలిగి ఉన్నాయి.
 
గుడ్లలో అధిక ప్రోటీనులు ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఉండి అతి తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. శరీర, కండర పుష్టిని పెంచుకోవడానికి కోడిగుడ్డు సహాయపడుతుంది. అధిక కొవ్వును నియంత్రించడానికి.. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవడానికి గుడ్లు బాగా సహాయపడుతాయి. గుడ్డు ఆరోగ్యం, పోషక విలువలు కల బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకుంటే శరీర కొవ్వు కరిగి ఎనర్జీ వస్తుంది. గుడ్డు పొట్ట నింపుతుంది. కొవ్వును కరిగించి ఎనర్జీగా మార్చి శరీరానికిస్తుంది.
 
ప్రతిరోజూ యాపిల్‌ పళ్లు తింటే శరీరంలో పేరుకున్న కొవ్వు కణాలు తగ్గుముఖం పడతాయి. యాపిల్‌ తోలులో ఉండే పెక్టిన్‌ శరీర కణాలు కొవ్వును పీల్చుకోకుండా నియంత్రిస్తాయి. యాపిల్స్‌లో నీటితో కూడిన పెక్టిన్ అధికంగా ఉండటం వల్ల ఇవి ఫ్యాట్ సెల్స్‌ను ఘననీయంగా తగ్గిస్తాయి. మాంసాహారంలో లీట్ మీట్‌ను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అదనపు కొలెస్ట్రాల్ చేరదు. లీన్ మీట్ ప్రోటీనులను అందిస్తుంది. లీన్ మీట్ తినడం వల్ల పొట్ట ఫుల్‌గా ఉన్నఅనుభూతిని కలిగిస్తుంది. ఎక్కువ సమయం ఆకలి కానివ్వదు.