శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 4 మార్చి 2015 (13:25 IST)

టీ బ్రేక్‌లో క్యారెట్ ముక్కలు తీసుకుంటే..?

స్నాక్స్‌గా బిస్కెట్లు, బర్గర్లు వంటి జంక్ ఫుడ్ తీసుకోవడం కంటే టీ టైమ్‌ బ్రేక్‌లో క్యారెట్ ముక్కలు తీసుకోవడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. క్యారెట్‌లో ఉండే విటమిన్స్, మినిరల్స్, లోక్యాలరీలు బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే క్యారెట్‌ను తీసుకోవడం ద్వారా దంత సమస్యలను సైతం దూరం చేసుకోవచ్చు. క్యారెట్ క్రిస్పీ, క్రంచీగా ఉండటం ద్వారా దంతాలను శుభ్రం చేయడంతో పాటు దంతాలను ఆరోగ్యంగా ఉంచుంది. 
 
ఇకపోతే.. క్యారెట్ జ్యూస్ చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. ఇంకా చర్మం ఆరోగ్యంగా ఉండటానికి నిరంతరం సహాయపడుతుంది. కంటి దృష్టి లోపాలకు క్యారెట్ దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఎందుకంటే క్యారెట్‌లో కళ్ళ ఆరోగ్యానికి సహాయపడే విటమిన్ ఎ గ్రేట్ గా సహాయపడుతుంది. 
 
క్యారెట్‌లో బీటాకెరోటిన్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది. ఇది హెల్తీ స్కిన్ పొందడానికి చాలా గ్రేట్‌గా పనిచేస్తుంది. ముడతలను నివారిస్తుంది. వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది. అందుచేత రోజూ ఓ గ్లాసులు క్యారెట్ జ్యూస్ తీసుకోవడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.