శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 26 ఫిబ్రవరి 2015 (16:42 IST)

విదేశాలకు వెళ్లేముందు క్యాష్ పాస్‌పోర్ట్ మస్ట్!

విదేశాలకు వెళ్లేముందు ట్రెక్కింగ్‌కు తగిన వస్తువులతో పాటు ప్రయాణంలో తక్కువ మోతాదు నగదు ఉంచుకోవాలి. ముఖ్యంగా కాఫీ తాగడానికి, స్థానిక ట్యాక్సీలలో తిరగడానికి, హోటల్స్‌లో టిప్స్ ఇవ్వడానికి తగిన నగదు దగ్గర ఉంచుకుంటే చాలు. నగదు కన్నా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వెంట ఉంచుకోవడం ఉపయుక్తం. 
 
ఇంకా క్యాష్ పాస్ట్‌పోర్ట్‌లో ఎక్కు మోతాదలో బ్యాలెన్స్ ఉంచుకోవడం ఎంతో మేలు. ప్రయాణంలో ఎక్కువ మొత్తంలో నగదు తీసుకెళ్తే పోయే ప్రమాదం ఉంది. అందుకే క్యాష్ పాస్ పోర్ట్ అందుబాటులోకి వచ్చింది. దీనిని ప్రపంచంలో  ఎక్కడైనా 24 గంటలూ ఉపయోగించుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా ఎంత మొత్తాన్నైనా నగదు బదిలీ చేసుకోవచ్చు. 
 
క్యాష్ పాస్ పోర్ట్ పొందేవారి వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. అప్లికేషన్ ఫామ్‌తో పాటు నివాస ధృవీకరణ పత్రం, ఫోటో, ఐడీ కార్డ్, పాస్ట్ పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ సమాచారం అవసరం. అప్లికేషన్‌లో తెలిపిన వివరాలన్నీ సరైనవని నిర్దారించుకున్నాక సంబంధిత ఏజెన్సీ 10 రోజుల తర్వాత ఈ కార్డ్‌ను మీకు అందజేస్తుంది.