బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 18 డిశెంబరు 2014 (11:37 IST)

రక్తవృద్ధికి సిట్రస్ ఫ్రూట్స్ తినండి!

రక్తవృద్ధికి సిట్రస్ ఫ్రూట్స్ తినండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పుల్లగా ఉండే ఫల్లాల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుదనే విషయం తెల్సిందే. అయితే పులుపును ఎక్కువగా తీసుకోకూడదని పెద్దలు అంటుంటారు. చింతపండు అధికంగా గల పదార్థాలు తీసుకుంటే రక్తం వృద్ధి కాదంటారు. 
 
అయితే నిమ్మ, ఉసిరి, జామ, ఆపిల్ వంటి ఫలాల్లో సీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. రక్తం వృద్ధి చెందడానికి విటమిన్ సి ఎంతో దోహదం చేస్తుంది. చాలామంది పులుపును తక్కువగా ఇష్టపడతారు. అది సరికాదంటున్నారు నిపుణులు. రక్తం తక్కువైన సందర్భాల్లో డాక్టర్లు ఐరన్ ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలని సూచించడం తెలిసిందే. 
 
అయితే, మనం తీసుకున్న ఐరన్ రక్తవృద్ధికి తోడ్పడాలంటే విటమిన్ సి సాయం తప్పనిసరి. విటమిన్ సి లేకపోతే మనం స్వీకరించే ఐరన్ తగిన మోతాదులో శరీరానికి అందదు. దాంతో, రక్తవృద్ధి సాధ్యం కాదంటున్నారు నిపుణులు. విటమిన్ సి లోపిస్తే రక్తం గడ్డడం చాలా ఆలస్యమవుతుంది. 
 
అంతేగాకుండా, రక్తహీనత కలిగి నీరసం వస్తుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. భారత్ లో 70 శాతం మంది విటమిన్ సి లోపంతో బాధపడుతున్నారని తెలిసింది. అందుచేత సిట్రస్ ఫ్రూట్స్‌ను తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.