శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2014 (18:04 IST)

బరువు తగ్గాలా? అయితే చల్లటి నీటితో స్నానం చేయండి.

హాట్ టబ్‌లో స్నానం చేస్తే బరువు తగ్గుతారని చెబుతుండటం వింటుంటారు. అయితే తాజాగా జరిపిన కొన్ని పరిశోధనలలో కోల్డ్ బాత్ కూడా బరువును తగ్గించడానికి సహాయపడుతుందని నిర్ధారించారు. చల్లని నీటితో స్నానం చేయడం ద్వారా బ్రౌన్ ఫ్యాట్ పెరగకుండా ఉంటుందని పరిశోధనలు తేల్చాయి. 
 
అలాగే చల్లని నీటితో స్నానం చేయడం ద్వారా ఎనర్జీని పెంచుకోవట్టు. అలసటగా ఉన్నప్పుడు చన్నీటి స్నానం చేయడం ఉత్తమ మార్గం. 
 
రెగ్యులర్‌గా చల్లని నీటి స్నానం చేస్తే మన శరీరంలో రోగాలతో పోరాడే తెల్ల రక్త కణాలు సంఖ్య పెరుగుతుందని పరిశోధనలు తేల్చాయి. రోగనిరోధక  పెరుగుతుంది. 
 
రీసెర్చ్ ప్రకారం పురుషులు అరగంట పాటు మూడు వారులు క్రమంగా వేడి నీటి స్నానం ఎవరైతే చేస్తారో వారిలో మరో ఆరు నెలల పాటు వంధ్యత్వం సమస్యలు ఏర్పడుతాయి. 
 
కాబట్టి ప్రత్యుత్పత్తి బెటర్‌గా ఉండాలంటే చన్నీటి స్నానం ఎంపిక చేసుకోవాలి. ఉదయం చేసే చన్నీటి స్నానం మరింత ఆరోగ్యకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.