శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (17:39 IST)

భాగస్వామితో జగడమా? అయితే ఒబిసిటీ తప్పదండోయ్!

ఇదేంటి.. అనుకుంటున్నారా? నిజమేనండి. పెళ్లికి తర్వాత భాగస్వామితో తరచూ కయ్యానికి కాళ్లు దువ్వేవారికి ఒబిసిటీ తప్పదని అమెరికా పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలో తేలింది. ప్రతీసారీ.. చీటికి మాటికి.. చిన్న చిన్న విషయాలకే భాగస్వామితో జగడానికి దిగే వారిలో ఒబిసిటీ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు తేల్చారు. 
 
భాగస్వామితో వాగ్వివాదానికి దిగి కొవ్వు అధికంగా గల పదార్థాలను తీసుకోవడం ద్వారా ఊబకాయం ఏర్పడుతుంది. 24 నుంచి 61 ఏళ్ల వరకు గల 43 మంది దంపతులపై ఈ పరిశోధన జరపడం జరిగింది.  
 
ఈ పరిశోధనలో మానసిక ఒత్తిడి ఒబిసిటీకి దారితీస్తుందని, భార్యాభర్తలు వాగ్వివాదానికి దిగి కొవ్వు అధికంగా గల పదార్థాలను తీసుకోవడం ద్వారా ఒబిసిటీ తప్పదని పరిశోధకులు అంటున్నారు. కొవ్వులోని కొన్ని కెలోరీలు కరిగిపోగా, మరికొన్ని అలాగే నిలిచిపోతాయి. తద్వారా ఆమ్లాలు ఉత్పన్నమై.. కరగని కొవ్వు రక్తంలోనే నిలిచిపోతుంది. 
 
ఇదే ఒబిసిటీకి దారి తీస్తుంది. తద్వారా వారానికి 5.4 కిలోల బరువు పెరుగుతుంది. ఫలితంగా హృద్రోగ వ్యాధులు సులువుగా ఏర్పడతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సో డిష్యూం డిష్యూంలోనూ ఫుడ్ తీసుకోవడంలోనూ జాగ్రత్తగా ఉండండి.