గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2015 (18:29 IST)

పెరుగు పుల్లగా ఉందని తినడానికి ఇష్టపడట్లేదా?

పెరుగు పుల్లగా ఉన్నప్పుడు చాలామంది తినడానికి ఇష్టపడరు. కానీ, పుల్లని పెరుగులో మంచి బ్యాక్టీరియా అధికంగా ఉండటం వల్ల క్యాలరీలను తగ్గించడానికి గ్రేట్‌గా సహాయపడుతుంది. ఇతర ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. 
 
అలాగే వేసవిలో ఎక్కువగా ఉపయోగించే నిమ్మకాయ బరువు తగ్గించడంలో గ్రేట్‌గా పనిచేస్తుంది. ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే పరకడుపున లెమన్ జ్యూస్ త్రాగడం వల్ల జీర్ణక్రియకు చాలా సహాయపడుతుంది. మరింత ఉత్తమ ఫలితాలను పొందాలంటే, ఇందులో కొద్దిగా తేనె మిక్స్ చేయాలి. అలాగే ఆరెంజ్ అంటే చాలా వరకూ పుల్లగానే ఉంటాయి. వీటిలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది.
 
టమోటోలు పుల్లగా ఉండటం వల్ల వ్యాధినిరోధకతను పెంచుతాయి. అంతే కాదు బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతాయి. క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. పండ్లలో రారాజుగా పిలుచుకొనే మామిడిపండ్లను తీసుకోవడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు. బరువు తగ్గించుకోవాలనుకుంటే మామిడిపండ్లను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.