శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 29 అక్టోబరు 2014 (17:29 IST)

వాకింగ్‌లో ముంబై కంటే ఢిల్లీ బెస్ట్.. అధ్యయనంలో వెల్లడి

నడక నాలుగు విధాలా మంచి చేస్తుందనే విషయం అందరికి తెలిసిందే. అయినా ప్రస్తుతం ఆధునిక యుగంలో నడిచేవారి సంఖ్య తగ్గిపోయింది. నడవాలని అనుకున్నా తగిన సమయం లేదంటుంటారు కొందరు. ఈ విషయాన్ని పక్కన పెడితే దేశంలో ఉదయం, సాయంత్రం వేళల్లో పనికట్టుకుని, దానికోసం సమయం కేటాయించుకుని నడిచే (వాకింగ్) చేసే వారి సంఖ్య మాత్రం బాగా పెరిగింది. 
 
వాకింగ్‌లో దేశ రాజధాని ఢిల్లీ నగర ప్రజలే బెస్ట్ అంటోంది మాక్స్ పూబా అనే సంస్థ. ఆ సంస్థ చేపట్టిన అధ్యాయనంలో రోజుకు ఎంత సేపు వాకింగ్ చేస్తున్నారు. వారు వాకింగ్ చేసే సమయంలో ఏం చేస్తుంటారు. వంటి పలు విషయాలను గురించి ఆ సంస్థ చేపట్టిన సమాచారాన్ని వెల్లడించింది. ఇందుకోసం ఆ సంస్థ ఢిల్లీ, ముంబై నగరాల నుంచి తలా వెయ్యి మంది చొప్పున మొత్తం 2000 మందిపై పరిశోధనలు నిర్వహించింది.
 
ఈ పరిశోధనల ఫలితాలలో ముంబై వాసుల కంటే ఢిల్లీ ప్రజలే ఎక్కువాగా వాకింగ్ చేస్తున్నట్టు వెల్లడైంది. ఈ లెక్కింపులో ఢిల్లీలో 56 శాతం మంది వాకింగ్ చేస్తుంటే, ముంబైలో 46 శాతం మందే వాకింగ్‌కు వెళుతున్నారట. అయితే ఒక వారం రోజుల్లో ముంబై వాసుల సగటు వాకింగ్ 48 నిమిషాలు కాగా ఢిల్లీ వాసులు సగటున వారానికి 35 నిమిషాలే నడుస్తున్నారట. 
 
ఢిల్లీ ప్రజల్లో 56 శాతం మంది కుటుంబీకులతో సహా వాకింగ్‌కు వెళుతుండగా, ముంబై వాసుల్లో 50 శాతం మంది మాత్రమే వాకింగ్‌కు కుటుంబ సభ్యులతో వెళుతున్నట్టు తెలిపింది. ఢిల్లీ, ముంబై అంటు రెండు నగరాలలో ప్రజలు మానసిక ఆందోళన, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న నేపథ్యంలో వాకింగ్ ద్వారా ప్రజల్లో ఉత్తేజం పెరిగినట్లు మాక్స్ పూబా సంస్థ ప్రధాన కార్యదర్శి